బిజినెస్

52 శాతం లోటుతో కేంద్ర వార్షిక బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ఈ ఆర్థిక సంవత్సరంతోబాటు 2019-20 తొలి రెండు నెలల అంచనాలను బట్టి కేంద్ర బడ్జెట్‌లో 52 శాతం లోటు నెలకొంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాల మేరకు వ్యయానికి, ఆదాయానికి మధ్య లోటు రూ. 3,66,157 కోట్లుగా ఉంటుందని అంచనా. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 55.3 శాతం వార్షిక లోటు బడ్జెట్ అంచనాలను ఏడాది క్రితం రూపొందించడం జరిగింది. అలాగే గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 2019-20 సంవత్సరానికి రూ. 7.03లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ లోటును చూపించడం జరిగింది. కాగా గత ఏడాదిలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక లోటును స్థూల వృద్ధిరేటులో 3.4 శాతం మించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో సీజీఏ గణాంకాల ప్రకారం 2019-20 ఏప్రిల్, మే మాసాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 7.3 శాతం ఉంటుంది. ఏడాది క్రితం కూడా ప్రభుత్వ ఆదాయ రాబడి దాదాపుగా ఇంతే ఉంది. ఏదిఏమైనప్పటికీ గత ఏడాది 21.3 శాతంతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో మూలధన వ్యయం ఈ ఏడాది 14.2 శాతం మాత్రమే. వచ్చే ఏప్రిల్, మే మాసాల్లో మొత్తం వ్యయం 5.12 లక్షల కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 18.4 శాతం) ఉంటుందని అంచనా. గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయం 19.4 శాతంగా ఉంది.