బిజినెస్

అనుచిత వాణిజ్య కార్యకలాపాలపై సెబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: బీఎస్‌ఈలోద్రవ్య నిల్వలకు సంబంధించిన విభాగంలో అనుచిత వాణిజ్య కార్యకలాపాలకు పాల్పడిన నాలుగు కంపెనీలపై మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ శుక్రవారం నాడిక్కడ కొరడా ఝళిపించింది. ఆ కంపెనీలకు రూ. 26 లక్షల మేర జరిమానాలు విధించింది. జీఎస్‌కే టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెమినా స్టాక్ మేనేజ్‌మెంట్, సాగర్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్‌పీఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లు ఈ మేరకు సెబీ శిక్షకు గురయ్యాయి. 2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్ వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించిన మీదట సెబీ ఈ సందర్భంగా న్యాయనిర్ణయం చేసింది. బీఎస్‌ఈ స్టాక్ ఆఫ్షన్స్ సెగ్మెంట్‌లో అనేక కంపెనీలు భారీగా రివర్సల్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు సెబీ గుర్తించింది. వాటాల కొనుగోళ్లు అమ్మకాల ఐచ్ఛికాల్లో క్లైంట్లు, కౌంటర్ పార్టీలు అడ్డగోలు వాణిజ్యాన్ని అనుసరించారని సెబీ పరిశీలనలో తేలింది. ఈ వాణిజ్య కార్యకలాపాలు సాధారణంగా జరగలేదని, బహిరంగ ఐచ్చికాలను ఇష్టా రీతిలో వర్గీకరించారని, కాంట్రాక్టుల ధరలు సైతం సవ్యంగా లేదని సెబీ పేర్కొంది. మోసపూరిత, అనుచిత వాణిజ్య కార్యకలాపాల నియంత్రణ చట్టం (పీఎఫ్‌యూటీపీ)ని ఉల్లంఘించినందుకు ఆ నాలుగు కంపెనీలపై చర్యలు తీసుకున్నట్టు సెబీ స్పష్టం చేసింది. కాగా ఇందులో ఎస్‌పీఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌కు 11.8 లక్షల జరిమానా విధించగా, మిగిలిన మూడు కంపెనీలకు ఒక్కో కంపెనీకి రూ. 5 లక్షల వంతున జరిమానా విధించినట్టు సెబీ తెలిపింది.