బిజినెస్

ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ చెల్లింపులు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) చెల్లింపులను మరో నాలుగు నెలలు వాయిదా వేసింది. ద్రవ్య లబ్ధతలో ఎదురవుతున్న చిక్కులే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. సుమారు 400 కోట్ల రూపాయల విలువైన బాండ్ల చెల్లింపు జరగాల్సి ఉంది. అయితే సకాలంలో ఈ చెల్లింపులను పూర్తి చేయలేకపోయిన ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ కొంత సమయాన్ని కోరుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీలోగా మెచ్యూరిటీ సొమ్ము తిరిగి చెల్లిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. రిటైల్ ఆస్తుల సమీకరణకు, వాస్తవ ప్రణాళికలకు మధ్య ఏ మాత్రం సారూప్యత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ రుణాలు, చెల్లింపులను పూర్తి చేయడం కోసం రిటైల్ ఆస్తులను అమ్మనున్నట్టు ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ ఇటీవల ప్రకటించిది. వీటి మొత్తం విలువ 5000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. గృహాలు ఇతర నిర్మాణాలకు ఈ కంపెనీ రుణాలు ఇస్తున్నది. హౌసింగ్ ఫైనాన్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ ఆ తరువాత కంపెనీ ఆదాయం దారుణంగా పడిపోయింది. మరోవైపు మెచ్యూరిటీ అయిన బాండ్ల ముఖ విలువను వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మల్లగుల్లాలు పడుతున్న ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ చెల్లింపులను నాలుగు నెలలు వాయిదా వేసి తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంది.