బిజినెస్

చమురు ఉత్పత్తుల తగ్గింపుపై రష్యా, సౌదీ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా, జూన్ 29: చమురు ధరలను స్థిరీకరించడానికి వీలుగా ఉత్పత్తులను తగ్గించాలన్న ‘ఒపెక్’ నిర్ణయం ప్రకారం రష్యా, సౌదీ అరేబియా శనివారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ఉత్పత్తిచేస్తున్న దేశాల సంస్థ ‘ఒపెక్’ డిమాండ్, సప్లై సమతూకాన్ని పాటించాలని నిర్ణయించింది. ఉత్పత్తి పెరిగితే చమురు ధరను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఒపెక్’ దేశాలు ఈ పరిణామం వల్ల భారీగా నష్టపోతున్నాయి. అందుకే డిమాండ్‌కు అనుగుణంగానే సప్లై ఉండాలనేది ‘ఒపెక్’ సిద్ధాంతం. ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాలను తాము గౌరవిస్తున్నట్టు రష్కా, సౌదీ అరేబియా ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు నిలకడగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాయి.