బిజినెస్

గిరిజనుల ఉత్పత్తులు కొనండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: గిరిజనుల ఉత్పత్తుల విక్రయం ద్వారా వారి ఆర్థిక స్థితి గతులను పెంపొందించి, ప్రోత్సహించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుత నడుం బిగించారు. ‘గిరిజనుల వద్దకు వెళ్ళండి..’ పేరిట మంత్రి రేణుకా శనివారం కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి రేణుక మాట్లాడుతూ గిరిజనుల కళలు, తయారు చేసే అద్భుతమైన చేతి వృత్తుల బొమ్మలను ప్రజలను కొనుగోలు చేయడం ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. గిరిజనులు తయారు చేసే హస్తకళలు, వస్త్రాలు, గాజులు ఇతరత్రా ఉత్పత్తులను ఇదివరకే గిరిజన సహకార మార్కెట్ అభివృద్ధి ఫెడరేషన్ (ట్రైఫాడ్) ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అయినప్పటికీ తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గ్లోబల్ మార్కెటింగ్, ఇ-కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ కూడా గిరిజనుల ఉత్పత్తులను విక్రయిస్తుందన్నారు. గిరిజనుల ఉత్పత్తులన్నీ ప్రకృతి సహజమైన, నాణ్యమైనవిగా ఉంటాయని చెప్పారు. ఇంకా తెలంగాణ కాఫీ, ఉత్తరాఖండ్ సబ్బులు, మట్టి కుండలు ఇతరత్రా వాటికి మంచి గిరాకీ ఉందన్నారు. ట్రైఫాడ్ అమెజాన్ సహకారంతో ఈ ఉత్పత్తులను మరింతగా ప్రజల్లోకి తీసుకెళుతున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమానికి కూడా అమెజాన్ సహకారం తీసుకుంటామని మంత్రి రేణుక వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ట్రైఫాడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ కూడా పాల్గొన్నారు.