బిజినెస్

ప్రభుత్వ రంగ బీమా సంస్థల ఆర్థికాభివృద్థిపై కేంద్రం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ప్రభుత్వ రంగ బీమా సంస్థలు ఆర్థికంగా బలోపేతం కావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆ రంగాలకు వచ్చే బడ్జెట్‌లో 13వేల కోట్ల రూపాయలు ఆర్థిదన్నుగా అందజేసే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి పలు ఆర్థికాభివృద్ధి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో ప్రథానంగా ప్రభుత్వ అధీనంలోని బీమా సంస్థలను ‘న్యూ ఇండియా అస్యూరెన్స్’తో విలీనం చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అలా చేయడం ద్వారా బీమా సంస్థల సమాహారం ఏర్పాటు చేయడంతోబాటు అన్‌లాక్ వాల్యూను సృష్టించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ‘పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణ సంస్థ (దీపం) మరికొన్ని ప్రతిపాదనలను సైతం ఈ దిశలో పరిశీలిస్తోంది. ఇందులో మూడు ప్రభుత్వ రంగ బీమా కంపెనీల వాటాలను విక్రయించాలన్న ప్రతిపాదన సుమారు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయి, ఈ కంపెనీల్లో వాటాల విక్రయం శీఘ్రతరం కావాలన్నది ‘దీపం’ లక్ష్యం. ఈ మూడు కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం కనీసం 12 నుంచి 13 వేల కోట్లు జొప్పించాల్సిన అవసరం ఉందని, తద్వారా ఆర్థికాభివృద్ధి చేసి ఆ సంస్థలను విలీనానికి సంసిద్ధం చేయవచ్చన్న ప్రణాళిక అమలు జరగాల్సి ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం విశే్లషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు కంపెనీలు ఒక అతిపెద్ద కంపెనీగా అవిర్భవించడం అన్ని విధాల శ్రేయస్కరమని ప్రభుత్వం భావిస్తున్నా ఇందుకు సంబంధించిన ప్రక్రియ వివిథ కారణాల దృష్ట్యా ఆలస్యమవుతోంది. ప్రధానంగా రెండు ప్రభుత్వ రంగ బీమా సంస్థలను దివాళా తీయకుండా కాపాడం కష్టతరంగా మారింది. ప్రత్యేకించి బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) సాల్వెన్సీ నిష్పత్తి 1.5ని పాటించడం ఆ కంపెనీలకు వీలు కావడం లేదు. పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు వెనక్కు తీసుకోవాలన్న అంశాన్ని కేంద్రం గత ఏడాది నుంచి అమలు చేస్తూ రూ. 85,045 కోట్ల రూపాయలు వెనక్కు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఏడాదీ రూ. 90 వేల కోట్లు డిసినె్వస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా సమీకరించాలన్న లక్ష్యం ఉంది.