బిజినెస్

జీఎస్‌టీ ఆదాయంలో రాష్ట్ర వాటా 4 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి జాతీయ స్థాయి ఆదాయంలో నాలుగు శాతం వాటా తెలంగాణ నుంచి వచ్చింది. అలాగే, హైదరాబాద్ నుంచి జీఎస్‌టీ వసూళ్లు నెలసరి 28 శాతం మేరకు వృద్ధిరేటు నమోదైంది. జాతీయ స్థాయిలో జీఎస్‌టీ కింద వసూలైన మొత్తం ఆదాయంలో నాలుగు శాతం తెలంగాణ నుంచి ఉండడం రికార్డని రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు తెలిపాయి. 2018-19 సంవత్సరంలో రూ. 36,212 కోట్ల మేర జీఎస్‌టీ వచ్చింది. దేశంలోని పన్ను చెల్లింపుదార్లలో మూడు శాతం మంది తెలంగాణలో ఉన్నారు. గత
ఏడాది తెలంగాణ నుంచి తమ లక్ష్యం మేరకు రూ. 19,420 కోట్లను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించగా, రూ.18565 కోట్ల ఆదాయం వచ్చింది. పైగా రూ.175 కోట్ల బకాయిలు కూడా వసూలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవా పన్ను బకాయిల చెల్లింపులో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. హైదరాబాద్ జోన్‌లో రూ. 458 కోట్ల బకాయిలు రావాల్సి ఉండగా రూ.272 కోట్లను వసూలు చేశారు. నకిలీ ఇన్‌వాయిస్‌లు చూపించిన 36 కంపెనీలు రూ. 277 కోట్లు ఎగవేశాయని అధికారులు గుర్తించారు. ఇందులో రూ.34 కోట్లను అధికారులు వసూలు చేశారు. ఈ సందర్భంగా పన్ను ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నారు.