బిజినెస్

ఉపాధి కల్పనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: దేశంలో ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ స్పష్టం చేశారు. భారతలో నిరుద్యోగిత రేటును ఎక్కువగా చూపిస్తూ వెలువడుతున్న కథనాలను సోమవారం ఆయ న ఖండించారు. తప్పుదోవపట్టించేందుకే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహా య మంత్రి లోక్‌సభలో వెల్లడించారు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన చెప్పారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యుడు అదూర్ ప్రకాశ్ నిరుద్యోగంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వివిధ రంగాల్లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రకాశ్ అడిగారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గంగ్వార్ ‘నిరుద్యోగానికి సంబంధించి వస్తున్న కథనాలు తప్పుదోవపట్టించేవిగా ఉన్నాయి. ఎక్కువగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు’అని ఆరోపించారు. మంత్రి ఈ సమాధానం ఇస్తున్నప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి నిరసన వ్యక్తమైంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) కింద 5,86,728కి ప్రయోజనం చేకూరినట్టు మంత్రి వెల్లడించారు. 2019 మార్చి 1 వరకూ నమోదైన గణాంకాలను ఆయనీ సందర్భంగా సభకు తెలిపారు. ఈమేరకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం కింద 2019 మార్చి 31నాటికి 18.26 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్టు గంగ్వార్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి రోజ్‌గార్ యోజన పథకం కింద అర్హులైన వారందరికీ ప్రభుత్వమే ఈపీఎఫ్, ఈపీఎస్ చెల్లించిందని మంత్రి చెప్పారు. 2019 జూన్ 16 నాటికి 1.21 కోట్లమందికి ప్రయోజనం చేకూరిందని ఆయన అన్నారు.