బిజినెస్

రుణ వసూళ్ల కోసం బలప్రయోగానికి ఏ బ్యాంకుకూ అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: రుణాలు తీసుకున్న వారిని బెదిరించి బకాయిలు వసూలు చేసేలా బౌన్సర్లను నియమించుకునేందుకు ఏ బ్యాంకుకూ అధికారం ఇవ్వలేదని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అయితే రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు రిజర్వు బ్యాంకు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ నియామకాలు సరైన పోలీసు వెరిఫికేషన్‌తో బాటు ఇతర లాంచనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే జరపాలన్న నిబంధన ఉందని ఆయన స్పష్టం చేశారు. రుణా ల బలవంతపు రికవరీ కోసం ఎలాంటి బలాడ్యులను లేదా బౌన్సర్లను నియమించుకునేందుకు ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదని ఆయన వివరించారు. బోర్డు ఆమోదించిన మార్గదర్శకాలే బ్యాంకులు పాటించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటుగా వత్తిడిచేసి రుణాల వసూళ్ల కోసం రుణ గ్రహీతలను బాధించడం, బల ప్రయోగం చేయడం వంటివి చేయడానికి వీలు లేదని ఖచ్చితమైన సర్క్యులర్లు జారీ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి బ్యాంకుపై నిషేధం విధించే విషయాన్ని సైతం ఆర్బీఐ పరిశీలిస్తుందన్నారు. అలాగే రికవరీ ఏజెంట్ల నియామకానికి రిజర్వుబ్యాంకు అనుమతిని నిరాకరించే అవకాశం ఉందన్నారు.