బిజినెస్

మెరిసిన పసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. 10 గ్రాములపై రూ. 280 పెరిగి మొత్తం ధర 34,380కి చేరింది. అంతర్జాతీయంగా ఇనె్వస్టర్లు అధికంగా బంగారంపై మదుపు చేసేందుకు ఆసక్తి చూపడంతోబాటు, దేశీయంగా డిమాండ్ పెరగడం బంగారం ధర పెరిగేందుకు దోహదం చేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర గరిష్టంగా 1,425 డాలర్లు పలికింది. అలాగే న్యూయార్కులో వెండి ధర సైతం ఔన్స్‌పై 15.31 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధరలు ఔన్స్‌పై 1,430 డాలర్ల వంతున జరగడంతో అన్ని దేశాల్లో బంగారం వ్యాపారానికి ఊతం లభించింది. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి మందగమనం అంచనాలతో మదుపర్లు బంగారంపై మదుపు సురక్షితంగా భావించి ఆవైపుమొగ్గు చూపారని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో 10 సంవత్సరాల కాలవ్యవధి బాండ్లు రెండేళ్ల కనిష్ట స్థాయి లబ్ధినే చేకూర్చడంతో మదుపర్లు బంగారం కొనుగోళ్ల వైపు మళ్లారని సీనియర్ విశే్లషకుడు తపన్ పటేల్ తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధంతోబాటు ఐరోపా దేశాల ఉత్పత్తులపై సుమారు 4 బిలియన్ డాలర్ల మేర సుంకాలు పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వు రేట్ల కోతపై ఊహాగానాలు స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగానూ, బంగారం మార్కెట్‌కు సానుకూలంగానూ మారాయని విశే్లషకులు చెబుతున్నారు. కాగా దేశ రాజధానిలో వెండి ధరలు సైతం కిలోపై రూ. 150 పెరిగి మొత్తం ధర 38,650కి చేరింది. ప్రధానంగా పారిశ్రామల యూనిట్ల నుంచి కొనుగోళ్లు పెరగడం వెండి ధరలకు ఊతమిచ్చింది. జాతీయ రాజధాని ఢిల్లీలో 99.5 శాతం స్వచ్ఛ బంగారం ధర 10 గ్రాములపై రూ. 34,380 పలుకగా, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ. 34,210 పలికింది. అలాగే సవరం (ఎనిమిది గ్రాముల) బంగారం ధరలు మాత్రం నిలకడగా రూ. 26,800 పలికింది. కాగా వార సరఫరా పద్ధతిలో కిలో వెండి ధర రూ. 349 పెరిగి మొత్తం ధర రూ. 37,348కి చేరింది. ఇక వెండి నాణేల ధరల్లో మాత్రం మార్పు లేదు. 100 పీసులు రూ. 81వేల వంతున ట్రేడయ్యాయి.