బిజినెస్

కేంద్ర బడ్జెట్‌కు ముందు మదుపర్ల వేచిచూసే వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 3: మరోరోజు వ్యవధిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ తీరుపై వస్తున్న పలు రకాల ఊహాగానాల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురై చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా మూడోరోజూ సూచీలు లాభాల బాటలోనే సాగినటైంది. బడ్జెట్‌కు ముందుకు మదుపర్లు వేచిచూసే దోరణిని అనుసరించడంతో బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 22.77 పాయింట్ల స్వల్ప ఆధిక్యతతో 0.06 శాతం లాభాలతో 39,839.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఒక దశలో 39,732.38 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 39,732.38 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం కేవలం 6.45 పాయింట్ల ఆధిక్యతతో 0.05 శాతం లాభాలతో 11,916.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 11,945.75 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 11,887.05 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, ఎస్‌బీఐ అత్యధికంగా 3.79 శాతం లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, వేదాంత, ఇన్ఫోసిస్, ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి అత్యధికంగా 1.44 శాతం నష్టపోయాయి. ఇలావుండగా తయారీ రంగంలో నెలకొన్న మందగమనం కారణంగా ఆర్థికాభివృద్ధి నెమ్మదించవచ్చన్న ఊహాగానాలతో అంతర్జాతీయ మార్కెట్లలో సైతం బుధవారం అనిశ్చితి నెలకొంది. ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో మార్కెట్ల సహా సియోల్ స్టాక్ మార్కెట్ సైతం బుధవారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మాత్రం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతోనే సాగాయి. కాగా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ ఎలావుంటుందో చూద్దామన్న వైఖరి మదుపర్లలో కనిపించింది. అలాగే జూన్ నెలలో సేవా రంగం తీరును, గణాంకాలను మదుపర్లు నిశితంగా గమనిస్తున్నారు. ఐహెచ్‌ఎస్ భారత మార్కెట్, వాణిజ్య, సేవా రంగ కార్యకలాపాల సూచీ జూన్‌లో 49.6 శాతానికి పడిపోయింది. మేలో ఈ సూచీ 50.2 శాతంగా ఉంది. సుమారు ఏడాది కాలంగా విక్రయాల్లో నెలకొన్న స్తబ్ధత ఇలా తగ్గుదల నెలకొనడానికి కారణమని విశే్లషకులు చెబుతున్నారు.
పెరిగిన ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బుధవారం 0.82 శాతం పెరిగాయి. బ్యారెల్ 62.91 డాలర్ల వంతున ట్రేడైంది. అలాగే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో స్తబ్ధత నెలకొంది. ఇంట్రాడేలో డాలర్‌కు 68.93 రూపాయలుగా ట్రేడైంది.