బిజినెస్

తగ్గిన మొండి రుణాల శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: మొండి రుణాల శాతాన్ని తగ్గించడంతో గడిచిన ఏడాది బ్యాంకింగ్ రంగ పనితీరు మెరుగుపడిందని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. ఐతే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంతోబాటు, వౌలిక మార్కెట్ల నుంచి ఏర్పడిన వత్తిడుల కారణంగా ఆర్థిక రాబడి కొంతమేరకే పరిమితమైందని గురువారం పార్లమెంటుకు సమర్పించిన 2018-19 ఆర్థిక సర్వే వెల్లడించింది. గత ఏడాది ద్రవ్య వినిమయ విధానం యూటర్న్ తీసుకోవడం కనిపించిందని తెలిపింది. విధాన రేట్ల సూచీ తొలుత 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగినా ఆ తర్వాత 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గిపోయిందని, ఇందుకు కారణం అనుకున్న స్థాయికంటే ద్రవ్యోల్బణం తగ్గిపోవడంతోబాటు వృద్ధిరేటు తగ్గడం, అంతర్జాతీయ ద్రవ్య వినిమయ విధాన సరళీకరణ వంటి అంశాలని నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు మెరుగుపడిందని, ఇందుకు ప్రత్యేక కారణం నిరర్థక ఆస్తుల నిష్పత్తి గణనీయంగా తగ్గడంతోబాటు మొండి బకాయిల శాతాన్ని తగ్గించేందుకు చేపట్టిన చర్యలేనని సర్వే తెలిపింది. ప్రధానంగా దివాళా, బ్యాంకుల మోసాల నియంత్రణ చట్టాన్ని సక్రమంగా వినియోగించుకోవడం మంచి ఫలితాలనిస్తోందని సర్వే తెలిపింది.
ఇక ద్రవ్య లభ్యత విషయానికి వస్తే 2018 సెప్టెంబర్ నుంచి ఇందులో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, ఐతే 2018- 19లోని చివరి రెండు త్రైమాసికాలతోబాటు 2019-20 తొలి త్రైమాసికంలో ద్రవ్య లభ్యతలో నెలకొన్న లోటు తగ్గి సంతృప్తికర స్థాయికి చేరిందని నివేదిక వివరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 11.5 శాతం నుంచి 10.1 శాతానికి తగ్గాయని తెలిపింది.