బిజినెస్

ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖను చేపట్టిన మొదటి మహిళా మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రతిపాదించనున్న 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఐటీ మినహాయింపు ఇచ్చే అవకాశాలున్నాయనే మాట గట్టిగా వినిపిస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్‌పై దేశ ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. ముఖ్యంగా సామాన్య జనంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపులు భారీగా ఉండాలని ఆశిస్తున్నారు. వినియోగ వస్తువులపై పన్ను భారం తగ్గుతుందనే మాట కూడా వినిపిస్తోంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో తన మొదటి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న నిర్మలా సీతారామన్ ఏ మేరకు సామాన్య జనానికి సంతోషం కలిగిస్తారు? ఉద్యోగులపై ఏ మేరకు ఆదాయం పన్ను తదితర మినహాయింపుల వర్షం కురిపిస్తారన్నదానిపై ఆసక్తినెలకొంది. పదిహేడవ లోక్‌సభ ఎన్నికలు ముందు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ ఉద్యోగులకు కొన్ని రాయతీలు ప్రకటించటం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించే సమయంలో ఈ మినహాయింపులకు మరింత స్పష్టత ఇస్తామనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిర్మలా సీతారామన్ ఆ హామీలను నిలబెట్టుకుంటారా? లేదా? ఆర్థిక రంగం బాగా దెబ్బతినటంతోపాటు నిరుద్యోగం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో వస్తున్న బడ్జెట్ ఈ మేరకు ఈ సమస్యలను పరిష్కరిస్తుందనేది వేచి చూడవలసిందే. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఉపాధి కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులు, పథకాలకు ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. జీడీపీ పెరుగుదల అతి తక్కువ స్థాయికి చేరుకున్నందున ఆర్థిక కార్యక్రమాలను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలను బడ్జెట్‌లో ప్రకటించవలసి ఉంటుంది. వస్తు వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించాల్సి ఉంటుంది. వస్తు వినియోగం పెరిగితేనే ఉత్పదక రంగం ఊపందుకుంటుంది. ఇదిలా ఉంటే రైతులకు వడ్డీలేని లక్ష రుపాయల రుణ సౌకర్యం కల్పించేందుకు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. దేశంలోని అక్రిడిటేషన్ జర్నలిస్టులకు ఆయుష్మాన్ భవ పథకాన్ని వర్తింపజేసే అవకాశాలున్నాయని తెలిసింది. నష్టంతో పని చేస్తున్న కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్నును విధించవచ్చునని ఫ్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొందరు పారిశ్రామికవేత్తలు పన్ను ఎగగొట్టేందుకు కొన్ని కంపెనీలను నష్టాలతో నడిపిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి కార్యకలాపాలను అరికట్టేందుకే కనీసం ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. సాలీనా పది కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొందే వ్యక్తులపై 40 శాతం పన్ను భారం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో రద్దు చేసిన వారసత్వ పన్నును మోదీ ప్రభుత్వం పునరుద్ధరించే అవకాశం ఉంది. 2015లో రద్దయిన సంపద పన్నును మళ్లీ విధించే అవకాశాలున్నాయని అంటున్నారు. అంకుర సంస్థల ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పెంచవచ్చునని చెబుతున్నారు.