బిజినెస్

కుదేలైన సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 5: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజల వాటాలను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మార్కెట్‌లోద్రవ్య లభ్యతకు ఇబ్బందులు తలెత్తవచ్చన్న ఆందోళనలతో శుక్రవారం కేంద్ర బడ్జెట్ అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. ప్రధానంగా లోహ, విద్యుత్, వాహన, ఐటీ కౌంటర్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజల వాటాలను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచేందుకు ఇదే మంచి తరుణమని వ్యాఖ్యానించారు. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 394.67 పాయింట్లు నష్టపోయి 39,531.99 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 39,441.38 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 40,032.41 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 50 షేర్ల నిఫ్టీ సైతం 135.60 పాయింట్లు నష్టపోయి 11,981.75 పాయింట్ల దిగువన స్థిరపడింది.
ఇంట్రాడేలో ఈసూచీ తొలుత 11,797.90 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 11,981.75 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఈక్రమంలో బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకెక్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి. ఎస్‌బ్యాంక్ అత్యధికంగా 8.36 శాతం నష్టపోయింది. అలాగే ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, వేదాంత, సన్‌పార్మా, టీసీఎస్ సైతం 4.81 శాతం భారీ నష్టాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ 2.16 శాతం లాభపడ్డాయి. కాగా ‘కంపెనీల్లో ప్రజల కనీస వాటాలు పెంచే విషయంలో సెబీ ఎంత సమయం కేటాయిస్తుంది, ఎలాంటి నియంత్రణలు తీసుకువస్తుందన్న విషయంపై వేచిచూడాల్సి ఉంద’ని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రథాన కంపెనీ వాటాలను తగ్గించడం వల్ల మార్కెట్లపై, కొన్ని ప్రథాన స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని సీనియర్ విశే్లషకుడు జగన్నాథం తునుగుంట్ల పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుతం కనీసం 25 శాతం ప్రజల వాటాలను అందుకోవడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈక్రమంలో వాటాలను విక్రయానికి పెట్టేందుకు ప్రథాన కంపెనీలకు సెబీ కొంత సమయం కేటాయించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం సక్రమంగా అమలు చేయాల్సి వుందని ఆయన అభిప్రాపడ్డారు. అలాగే విదేశీ పోర్ట్‌పోలియో ఇనె్వస్టర్లకు సంబంధించిన ‘నో యువర్ క్లెయింట్ (కేవైసీ) వౌలిక సూత్రాలను సైతం ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం హేతుబద్ధీకరించించడంతోబాటు కట్టుదిట్టం చేసింది. విదేశీ పోర్టుపోలియో మదుపర్లకు స్నేహపూర్వక పెట్టుబడుల విధానం అందించాలన్న లక్ష్యం అందులో ఉంది.
అలాగే బ్యాంకులకు ఏకదఫా పాక్షిక రుణ హామీని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన నిల్వ చేసిన ఆస్తుల కొనుగోళ్లపై అందజేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎలక్ట్రానిక్ నిధుల సమీకరణ విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఉందని ఆమె చెప్పారు. కాగా మధ్యంతర కేంద్ర బఢ్జెట్‌లో అంచనావేసిన 90 వేల కోట్ల రూపాయల వాటాలను వెనక్కు తీసుకునే (డిసెనె్వస్ట్‌మెంట్) కార్యక్రమంలో ఆ అంచనా మొత్తాన్ని 1,05,000 కోట్లకు పెంచుతూ సవరించినట్టు ఆమె ప్రకటించారు.
స్వల్పంగా బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే శుక్రవారం రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 68.52 రూపాయలుగా ట్రేడేంది. ఆసియా ఖండంలో చైనా, జపాన్, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూడగా ఐరోపా దేశాల మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలతోనే సాగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 0.52 శాతం పెరిగి బ్యారెల్ 63.63 డాలర్లుగా ట్రేడైంది.