బిజినెస్

గన్నవరం విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసుల రద్దు, కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: వివిధ కారణాల వల్ల గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం (విజయవాడ) నుంచి పలు విమాన సర్వీసుల రద్దు, కుదింపు జరుగుతోంది. ఇప్పటికే గన్నవరం నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమాన సర్వీసును రద్దుచేయగా, మరికొన్ని సర్వీసులను వివిధ విమానయాన సంస్థలు కుదించనున్నాయి. నష్టాల కారణంగా అనేక రూట్లలో విమాన సర్వీసులు రద్దుచేస్తున్న ఎయిర్ ఇండియా తాజాగా గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా కొన్ని సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 16 నుంచి మరికొన్ని విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేయనుంది. జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విజయవాడ నుంచి ఢిల్లీ విమాన సర్వీసును రద్దుచేయగా, ఈ నెల 16 నుంచి వారానికి నాలుగుసార్లు మాత్రమే ఢిల్లీకి విజయవాడ నుంచి విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించింది. విజయవాడ - విశాఖ మధ్య నడిపే రెండు విమాన సర్వీసుల్లో ఒకదాన్ని రద్దుచేసి ఒక విమానాన్ని మాత్రమే నడపనుంది. ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7300 కోట్ల రూపాయల మేర నష్టాలు చవిచూడగా, 58వేల కోట్ల రూపాయల మేర అప్పుల్లో కూరుకుపోయింది. విదేశీ కరెన్సీ మారకం ధరల్లో తేడాలు, చములు ధరలు, అప్పులపై వడ్డీ భారం వంటివి ఎయిర్ ఇండియా నష్టాలకు కారణమయ్యాయి. దీంతో కొన్ని సర్వీసులను రద్దు చేయడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు భావిస్తున్నారు.
తిరుపతి, బెంగళూరు/మైసూరు మధ్య నడిచే ఎలియన్స్ ఎయిర్ విమాన సర్వీసును కూడా ఈ నెల 16 నుంచి నిలిపివేయనున్నారు. ఇప్పటికే సింగపూర్‌కు విమాన సర్వీసులను ఇండిగో నిలిపివేయగా, కొచ్చి, తిరుపతిలకు సర్వీసులను స్పైస్‌జెట్ సంస్థ నిలిపివేసింది. ఆక్యుపెన్సీ తగినంతగా లేకపోవడంతో ఆయా విమానయాన సంస్థలు తమ సర్వీసులను కుదించటం, లేదా రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.