బిజినెస్

బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ. 1,85,624 కోట్ల మేర కుచ్చు టోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: గత 11 సంవత్సరాల కాలంలో మనదేశంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రూ. 1,85,624 కోట్ల మేర మోసపోయాయి. ఇందుకు సంబంధించి కేసులు 44,016 నమోదయ్యాయి. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ మోసాలు, కేసుల గణాంకాలు మంగళవారం రాజ్యసభకు చేరాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 25,883.99 కోట్ల రూపాయల మేర అవినీతి, మోసగింపులు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి 3,927 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో బీజేపీ సభ్యుడు ఆర్‌కే సిన్హా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సైతం ఈ కేసులు 4,504కు పెరిగినప్పటికీ ఇందుకు సంబంధించిన నిధులు మాత్రం 9.866.23 కోట్ల రూపాయలేనని వివరించారు. 2018-19లో మొత్తం రూ. 6,734.60 కోట్లకు సంబంధించిన 2,836 కేసులు నమోదయ్యాయి. కాగా 2012-13 ఆర్థిక సంవత్సర కాలంలో బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు భారీగా మోసపోయాయి. అ ఏడాది మొతం 24,819.36 కోట్ల రూపాయల మేర మోసపోగా 4,504 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, రూ. 50 కోట్లకు పైబడిన మొండిబకాయిలకు సంబంధించి నిరర్ధక ఖాతాలను నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ మోసాల నియంత్రణకు ‘విదేశాలకు పారిపోయే ఆర్ధిక మోసగాళ్ల చట్టం 2018’ని ప్రత్యేకంగా తీసుకరావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. భారత న్యాయ స్థానాల పరిధికి దూరంగా ఉంటూ చట్టాల నుంచి తప్పించుకోవాలనుకునే మోసగాళ్ల పనిపట్టేందుకు ఈ చట్టం దోహదం చేస్తుందని ఠాకూర్ వివరించారు. అలాంటి మోసగాళ్ల ఆస్తులను అటాచ్ చేసేందుకూ చట్టం వెసులుబాటు కల్పిస్తుందన్నారు. రూ.50 కోట్ల పైబడిన రుణాలు తీసుకునే కంపెనీలకు చెందిన ప్రమోటర్లు లేదా డైరెక్టర్లు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన పాస్‌పోర్టుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించామని ఆయన చెప్పారు. అలాగే ఆ బ్యాంకుల అధికారులకు సైతం లుకవుట్ సర్క్యులర్ల కోసం విజ్ఞప్తి చేసే అధికారాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ చర్యలవల్ల రిజర్వు బ్యాంకు ఆర్థిక స్థిరత్వం బలపడిందని 2019 జూన్‌లో వెలువడిన ఎఫ్‌ఎస్‌ఆర్ నివేదిక స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత మిగులు స్థాయికి చేరిందని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఠాకూర్ తెలియజేశారు.
చిత్రం... రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్