బిజినెస్

ఫీజులు వెనక్కి ఇచ్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఆమోదం లేకుండా విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన ఫీజులను వెనక్కు ఇచ్చేందుకు ఎట్టకేలకు వాసవి యాజమాన్యం దిగివచ్చింది. వాసవి యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల సంఘం నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున మరో మారు ఉద్యమించడానికి సిద్ధపడటంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావడంతో యాజమాన్యం దిగివచ్చింది. టీఏఎఫ్‌ఆర్సీ ఖరారు చేసిన ఫీజుల కంటే వాసవి ఇంజనీరింగ్ కాలేజీ అదనంగా ఫీజు వసూలు చేసిందని, దానిని వాపస్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని తల్లిదండ్రుల సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లింది. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే యాజమాన్యం అమలుచేయాలని కోరారు. బ్లాక్ పీరియడ్‌కు వాసవి కాలేజీ ఏటా 97వేలు వసూలు చేయాల్సి ఉండగా, యాజమాన్యం బలవంతంగా విద్యార్థుల నుండి 1.60 లక్షలు వసూలు చేసిందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అదనంగా ఏడాదికి 63 వేలు చొప్పున వసూలు చేసిందని ఆ సొమ్మును రిఫండ్ చేయాలని వారు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం నాయకులు అధ్యక్షుడు ఎస్ శ్రీనాధ్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగాటి నారాయణ, వాసవి పేరెంట్స్ సంఘం కార్యదర్శి రమేష్‌కుమార్, కోశాధికారి సురేష్, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్ తదితరులు ఫీజులపై పట్టుపట్టడంతో యాజమాన్యం దిగివచ్చింది.