బిజినెస్

అందుబాటులోకి మరో 4 లక్షల బెర్త్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: దేశంలో అక్టోబర్ నుంచి రైల్వే ప్రయాణికులకు ప్రతి రోజు నాలుగు లక్షలకు పైగా బెర్త్‌లు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేలు అక్టోబర్ నుంచి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించబోతున్నాయి. రైళ్లలో లైట్లకు, ఎయిర్-కండీషనింగ్‌కు అవసరమయిన విద్యుత్తు పవర్ కార్లలో కాకుండా ఇంజన్లలో ఉత్పత్తి కావడానికి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుంది. ఈ టెక్నాలజీని అవలంబించడం మొదలయిన తరువాత రైల్వేల్లో బెర్త్‌ల సంఖ్య పెరుగుతుందని సీనియర్ అధికారులు బుధవారం ఇక్కడ తెలిపారు. ప్రస్తుతం ప్రతి రైలు చివరలో ఒకటి లేదా రెండు పవర్ కార్లు ఉంటున్నాయి. వీటిలో ‘ఎండ్ ఆన్ జనరేషన్’ (ఈఓజీ) అనే డీజిల్ జనరేటర్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి, కోచ్‌లకు సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న కొత్త టెక్నాలజీని ఇప్పుడు భారత్‌లో అవలంబించనున్నారు. ‘హెడ్ ఆన్ జనరేషన్’ (హెచ్‌ఓజీ) అనే ఈ కొత్త టెక్నాలజీలో రైళ్ల పైన ఉన్న విద్యుత్ లైన్ల నుంచి విద్యుత్‌ను సేకరించి, కోచ్‌లకు సరఫరా చేస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి భారతీయ రైల్వేల్లోని అయిదు వేలకు పైగా గల కోచ్‌లు కొత్త టెక్నాలజి ప్రకారం నడుస్తాయని అధికారులు వివరించారు. ఈ కొత్త టెక్నాలజి వల్ల పవర్ కార్లను తొలగించడంతో పాటు మరిన్ని కోచ్‌లను అమర్చడానికి వీలు కలుగుతుంది.
పైగా రైల్వేలకు ఇప్పుడు ప్రతి నెలా అవుతున్న రూ. 6వేల కోట్ల ఇంధన వ్యయం ఆదా అవుతుందని వారు తెలిపారు. కొత్త టెక్నాలజి అమలులోకి వచ్చిన తరువాత ఒక్కో రైలులో కేవలం ఒక్క పవర్ కార్‌ను మాత్రమే స్టాండ్‌బైగా ఉపయోగించడానికి ఉంచుతారని వారు వివరించారు.