బిజినెస్

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. వైసీపీ పక్షం నాయకుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం చెప్పారు. పెట్రోలియం ఉత్పాదనలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలంటే ఆ సమాఖ్య సిఫారసు చేయవలసి ఉంటుంది.. ఇంతవరకు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని మంత్రి వివరించారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని జీఎస్‌టీ సమాఖ్య ఎలాంటి సిఫారసు కూడా చేయలేదని మంత్రి వెల్లడించారు. రాజ్యాంగంలోని ఏడవ అధికరణం
కింద పొందుపరిచిన జాబితా ప్రకారం పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, గ్యాస్, విమానాల్లో ఉపయోగించే ఇంధనంపై సుంకం విధించే అధికారం ఆయా రాష్ట్రాలకు మాత్రమే ఉన్నట్లు మంత్రి తెలిపారు.
అమరావతికి నిధులు
రాష్ట్ర రాజధాని అమరావతికి స్మార్ట్ సిటీ మిషన్ పథకం కింద రూ.500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి తెలిపారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు పురి లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ మొత్తానికి సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ.500కోట్లు కేటాయించవలసి ఉంటుందని పురి తెలిపారు. అమరావతికి స్మార్ట్ సిటీ పథకం కింద రూ.2000కోట్లు ఇవ్వవలసి ఉండగా కేంద్రం ఇచ్చిన 500కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన రూ.500కోట్లు కాగా మిగతా సొమ్మును వివిధ ప్రభుత్వ పథకాలను సమ్మిళితం చేయటం ద్వారా సాధించవలసి ఉంటుందని పురి స్పష్టం చేశారు. అమరావతికి సంబంధించిన ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.2046 కోట్లుగా నిర్దారించగా అందులో నుండి రూ.1000 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవలసి ఉంటుంది. వివిధ ప్రభుత్వ పథకాలను విలీనం చేయటం ద్వారా రూ.418కోట్ల రుణాలు, బాండ్ల రూపంలో రూ.427 కోట్లు సేకరిస్తారని మంత్రి చెప్పారు. పీపీపీ ప్రాజెక్టుల ద్వారా రూ.201 కోట్లు సేకరిస్తారని మంత్రి వివరించారు.