బిజినెస్

దేశ ఆర్థిక స్థితి బలహీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: దేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు తీసుకెళ్లగలిగే ఎలాంటి మార్గదర్శకాలూ 2019-20 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో లేవని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం గురువారం రాజ్యసభలో ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి పెద్ద నిర్ణయాలు, నిర్మాణాత్మక సంస్కరణలూ లేవని ఆయన అన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని ఈ పరిస్థితుల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధిని గాడిలో పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని, ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి నిలపాలని చిదంబరం సూచించారు. అసలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం చప్పగా సాగిందని ఆయన పెదవివిరిచారు. ఈ బడ్జెట్‌లో ఎక్కడా పెట్టుబడులను, పొదుపును పెంచే ప్రణాళికలు లేవని విమర్శించారు. 2024-25 కల్లా దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల వార్షికాదాయం వైపునకు తీసుకువెళతామన్న మోదీ ప్రభుత్వ ప్రకటనను ఆయన ఎద్దేవా చేస్తూ వచ్చే ఆరు నుంచి ఏడేళ్లలో మాయాజాలాలు ఏవీ చేయకుండానే అసలు ఏ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ప్రమేయం లేకుండానే ఆర్థిక స్థితి ద్విగుణీకృతం అవుతుందని చిదంబరం వ్యాఖ్యానించారు. అసలు స్థూల ఆర్ధికాభివృద్ధి గణాంకాలను మంత్రి నిర్మలాసీతారామన్ ఈ బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని,ప్రత్యేకించి ఆదాయం ఎంత వచ్చిందనే విషయంలో స్పష్టత లోపించిందన్నారు. ప్రజలు పూర్తి గణాంకాలు కావాలని కోరుకుంటారని అందుకు అనుగుణంగా ఆమె వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘5ట్రిలియన్ డాలర్ల వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా వీలవుతుందో నేను వివరిస్తాను. 1990-91 దేశ వార్షిక ఆదాయం 320 బిలియన్ డాలర్లు. 2003-4లో ఇది ద్విగుణీకృతమై 618 డాలర్లకు చేరింది. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం వచ్చింది. నాలుగేళ్లలో వార్షికాదాయం ద్విగుణీకృతమై 1.22 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2017 సెప్టెంబర్ నాటికి ఈ ఆదాయం సైతం ద్విగుణీకృతపై 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈక్రమంలో వచ్చే ఐదేళ్లలో ఈ ఆర్థికాభివృద్ధి గణాంకాలు ద్విగుణీకృతమై 5 ట్రిలియన్ డాలర్లకు చేరడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇందులో ఏ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ప్రమేయమూ అవసరం లేదు’. అని చిదంబరం గత గణాంకాలను ఏకరవుపెట్టారు. ప్రస్తుతం దేశ సాధారణ వృద్ధిరేటు 12 శాతంగా ఉందనుకుంటే 6 ఏళ్లలో ఇది ద్విగుణీకృతం అవుతుందని, లేదు 11 శాతమే వృద్ధి ఉంది అంటే ఏడేళ్లలో ద్విగుణీకృతం అవుతుందని, అందువల్ల ఈ అంశాన్ని ఆకాశానికెత్తేసి చూపించాల్సిన అవసరం లేదని అన్నారు. ‘ఐనా ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే చంద్రుడిపైకి చంద్రయాన్ చేరినంత అని దేశ ప్రజలకు తెలుస’ని ఆయన ఎద్దేవా చేశారు.
చిత్రం... మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం