బిజినెస్

కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ సానుకూలతలతో కేంద్ర బడ్జెట్ తర్వాత గురువారం తొలిసారిగా దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుని మంచి లాభాలు అందుకున్నాయి. ఈ నెలలోనే రేట్ల కోత ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జరోమ్ పావెల్ సంకేతాలివ్వడం మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ప్రత్యేకించి లోహ, వాహన, ఫైనాన్షియల్ స్టాక్స్ అత్యధికంగా లాభపడ్డాయి. ఒక్కసారిగా 335 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ చివరిగా 0.39 శాతం లాభాలతో 266.07 పాయింట్ల ఆధిక్యతతో 38,823.11 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 38,892.50 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 38.631.31 పాయింట్ల కనిష్టాన్ని స్పృశించింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 84 పాయింట్ల ఆధిక్యతతో 0.73 శాతం లాభపడి 11,582.90 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఈ సూచీ సైతం ఇంట్రాడేలో ఒక దశలో 11,582.90 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 11,519.50 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో హీరోమోటోకార్ప్ అత్యధికంగా 4.46 శాతం లాభపడింది. అలాగే టాటామోటార్స్, వేదాంత, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, సన్‌పార్మా, టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ సైతం 3.63 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు టెక్‌మహీంద్రా, ఎస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఆక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ 1.27 శాతం నష్టపోయాయి. బడ్జెట్ తర్వాత గురువారం తొలిసారిగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ఆరంభం కావడం మదుపర్లలో ఆనందాన్ని నింపింది. కాగా అమెరికా ఫెడరల్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఎంతగానో ఊతమిచ్చాయి. ‘అమెరికా ఆర్ధికాభివృద్ధి ఇప్పటికీ మందగమనంలోనే ఉంది. అందుకే ఫెడరల్ తదనుగుణంగా వ్యవహరించి ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే చర్యలు చేపడుతుంది’. అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు తదుపరి రేట్ల కోతకు సంకేతాలని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దీంతో ఆసియా మార్కెట్లకు సానుకూలత లభించింది. షాంఘై కాంపోజిట్ సూచీతోబాటు, హ్యాంగ్‌సంగ్, నిక్కీ, కోస్పి గురువారం లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభపడ్డాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 14 పైసలు పెరిగి 68.43 రూపాయలుగా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సైతం 0.61 శాతం పెరిగాయి. బ్యారెల్ ధర 67.42 డాలర్లు పలికింది.