బిజినెస్

మళ్లీ నష్టాల బాటలో స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 12: వివిధ సంస్థలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న క్రమంలో శుక్రవారం మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించడంతోబాటు వాటాల విక్రయానికి పాల్పడ్డారు. దీంతో వాణిజ్య వారం చివరి రోజు సైతం స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే నడిచాయి. సూచీలు అద్యంతం ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధానంగా ఫైనాన్షి స్టాక్స్ తీవ్ర నష్టాలకు గురయ్యాయి. మధ్యాహ్నం వరకు 337 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 39,000 పాయింట్ల మార్కును తాకింది. ఐతే తర్వాత భారీగా వాటాల విక్రయ వత్తి నెలకొనడంతో ఈ సూచీ అంతేవేగంగా దిగివచ్చింది. చివరికి 86.68 పాయింట్లు కోల్పోయి 0.22 శాతం నష్టాలతో 38,736.23 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 38,684.85 పాయింట్ల కనిష్టాన్ని తాకి తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 30.40 పాయింట్లు కోల్పోయి 0.26 శాతం నష్టాలతో 11,552.50 పాయింట్ల దిగువ స్థాయిలో స్థిరపడింది. ఓ దశలో ఈ సూచీ 11,538.60 పాయింట్ల కనిష్టాన్ని, మరోదశలో 11,639.55 పాయింట్ల గరిష్టాన్ని స్పృశించింది. ఇలావుండగా సెనె్సక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఆక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిటెల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీద్రా బ్యాంక్ అత్యధికంగా 2.08 శాతం నష్టపోయాయి. మరోవైపు వేదాంత, సన్‌పార్మా, టాటాస్టీల్, ఏసియన్ పెయింట్స్, హీరోమోటోకార్ప్, ఎస్ బ్యాంక్ 2.44 శాతం లాభపడ్డాయి. సానుకూల త్రైమాసిక లాభాలను ప్రకటించడంతో ఇన్ఫోసిస్ శుక్రవారం స్టాక్‌మార్కెట్‌లో 0.87 శాతం అదనంగా లాభపడింది. కాగా ద్రవ్యోల్బణం, పరిశ్రమల ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు వేచిచూసే వైఖరిని అవలంభించారని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రస్తుతం భారత్- అమెరికా మధ్య నడుస్తున్న వాణిజ్య చర్చలు ఏ ఫలితాలిస్తాయన్న అంశంపై సైతం మదుపర్ల దృష్టి నిలించింది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం నెలకొంది. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో కేపిటల్ గూడ్స్, టెలికాం, చమురు, సహజవాయులు, పరిశ్రమలు, విద్యుత్, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సూచీలు 1.22 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. లోహ, వౌలక పరికరాలు, గృహ నిర్మాణం, ఆరోగ్య రక్షణ రంగాలు 0.91 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం 0.41 శాతం లాభాలను నమోదు చేశాయి. ఇలా ఉండగా ఆసియా ఖండంలోని షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పి శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఐరోపా దేశాల మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి.
రూపాయి బలహీనం: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం 13 పైసలు తగ్గి ఇంట్రాడేలో మొత్తం 68.57 రూపాయలుగా ట్రేడైంది.