బిజినెస్

ఇన్ఫోసిస్ త్రైమాసిక లాభాల్లో 5.2 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: మనదేశానికి చెందిన రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గడచిన జూన్ నెలతో ముగిసిన ఈ త్రైమాసికంలో మొత్తం రూ. 3,802 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. ఈ మొత్తం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.2 శాతం అధికమని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,612 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు వివరించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ నిర్వహణల (ఆపరేషన్స్) విభాగం ద్వారా వచ్చే ఆదాయంలో సైతం 13.9 శాతం వృద్ధి చోటుచేసుకుని మొత్తం రూ. 21,803 కోట్లకు చేరిందని తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 19,128 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. 2020 సంవత్సరం వరకు నిలకడగా కరెన్సీని నిర్వహిస్తూ 8.5 నుంచి 10 శాతం పెంచేందుకు అవసరమైన మార్గదర్శకాలను పాటిస్తూ తమ సంస్థ వృద్ధిని సాధించి ఆ నివేదిక పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ ఆదాయ వృద్ధి 7.5 నుంచి 9.5 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు గత ఏప్రిల్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రకటించడం జరిగింది. తమ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరాన్ని బలమైన ఆదాయ మార్గంతో ఆరంభించడం ఆనందంగా ఉందని, డిజిటల్ ఆదాయంలో సైతం 41.9 శాతం వృద్ధిని సాధించామని ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ తెలిపారు. ప్రధానంగా క్లెయింట్‌ల సమస్యల పరిష్కారం, పెట్టుబడులపై స్థిరమైన దృష్టిని కేంద్రీకరించడం ద్వారానే ఈ వృద్ధి సాధ్యమైందని ఆయన వివరించారు. సవరించిన మూలధన నిల్వల నిర్వహణ విదానాన్ని అమలు చేసేందుకు తమ సంస్థకు చెందిన బోర్డు ఆమోదం తెలిపిందని, ప్రధానంగా వ్యూహాత్మక ద్రవ్య నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చిందని సలీల్ ఫరేఖ్ తెలిపారు.