బిజినెస్

ప్రయాణికులు పెరుగుతున్నా.. సేవలు సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 14: ఒక ప్రాంత ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందంటే అక్కడ పారిశ్రామిక, పర్యాటక రంగాలు పరుగులు తీస్తున్నాయని అర్థం. పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో వౌలిక సదుపాయాలు ఎంత అవసరమో, రవాణా వ్యవస్థా కీలకమే. విభజన అనంతరం నవ్యాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక రంగాలు ఆశించిన స్థాయిలోనే అభివృద్ధి చెందుతున్నాయి. అయితే, కీలకమైన రవాణా వ్యవస్థలో మాత్రం అందుకు తగినట్టు వృద్ధి కన్పించట్లేదు. ముఖ్యంగా రాష్ట్ర విభజన నాటికి నవ్యాంధ్రలో విమాన ప్రయాణికుల సంఖ్య కేవలం 27.99 లక్షలు మాత్రమే. అప్పటికి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే పూర్తిగా అందుబాటులో ఉండేది. దీనితో పాటు విజయవాడ (గన్నవరం), తిరుపతి(రేణిగుంట) విమాశ్రయాల నుంచి కూడా ఒకటి, రెండు డొమెస్టిక్ సర్వీసులు నడుస్తుండేవి. ఒక్క విశాఖ నుంచి మాత్రమే విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. విశాఖ నుంచి దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్ సర్వీసులు ఒకటొకటిగా అందుబాటులోకి వచ్చాయి. నవ్యాంధ్రలో 2015-16 నాటికి విమాన ప్రయాణికుల సంఖ్య 27.99 లక్షలు. 2016-17 సంవత్సరానికి విమాన ప్రయాణికుల సంఖ్య 33.25 వృద్ధి రేటుతో 37.3 లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో విమాన ప్రయాణికుల వృద్ధి రేటు కేవలం 18.3 శాతం మాత్రమే. ఇక 2017-18లో 10.49 శాతం వృద్ధిరేటుతో ప్రయాణికుల సంఖ్య 41.22 లక్షలకు పెరిగింది. జాతీయ స్థాయిలో ప్రయాణికుల వృద్ధిరేటు 16.52 శాతంగా నమోదైంది. 2018-19లో నవ్యాంధ్రలో ప్రయాణికుల సంఖ్య 31.61 శాతం వృద్ధితో 54.25 లక్షలకు చేరుకుంది. జాతీయ స్థాయిలో దీని వృద్ధి 11.64శాతం మాత్రమే. ప్రతి ఏటా నవ్యాంధ్ర నుంచి ప్రయాణికుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వస్తుంటే విమాన సర్వీసలు మాత్రం నానాటికీ తీసికట్టుగా తగ్గిపోతున్నాయి.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒకప్పుడు అయిదు అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం నాలుగు సర్వీసులు మాత్రమే ఉన్నాయి. మలేషియా, బ్యాంకాక్, సింగపూర్‌లకు విశాఖ నుంచి నేరుగా సర్వీసులు నడుస్తుండగా, దుబాయ్‌కి హైదరాబాద్ మీదుగా సర్వీసు నడుస్తోంది. అంతకు ముందు కొలంబోకు కొన్ని నెలల పాటు సేవలందించిన శ్రీలంకన్ ఎయిర్ వేస్ సంస్థ సర్వీసును రద్దు చేసుకుంది. విజయవాడ నుంచి కేవలం కొద్ది రోజులు మాత్రమే నడిచిన సింగపూర్ సర్వీసు కూడా రద్దు పద్దులో చేరిపోయింది. ఇక విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి ఎయిర్ ఇండియా సర్వీసును రద్దు చేసుకుంది. ఈ సర్వీసును ప్రస్తుతం విశాఖపట్నం-విజయవాడ-హైదరాబాద్‌కు నడపాలని నిర్ణయించారు. నవ్యాంధ్రలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నప్పటికీ సర్వీసులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. దీనిపై ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ పలు సందర్భాల్లో ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్, మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి సారథ్యంలో పలుసార్లు కేంద్ర పౌర విమానయాన సంస్థప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లోనైనా నవ్యాంధ్రలో విమాన సర్వీసులు పెరిగితే అటు ఆదాయంతో పాటు పర్యాటకం వృద్ధి సాధిస్తుందని అంతా భావిస్తున్నారు.