బిజినెస్

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సీఎన్‌జీ బంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్: రాష్ట్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో 18 పెట్రోల్ బంకులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, సీఎన్‌జీ బంకులు కూడా ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర జైళ్లశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ సైదయ్య అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మై నేషన్ పెట్రోల్‌బంకు, స్టాల్‌ను పరిశీలించి వినియోగదారులతో మాట్లాడి, సబ్‌జైలును తనిఖీ చేసిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ అవసరాన్ని బట్టి సీఎన్‌జీ బంకులను ఏర్పాటుకు ప్రదేశాలను పరిశీలిస్తామన్నారు. బంకుల వల్ల ఏటా 25 కోట్ల రూపాయలు లాభం తమ శాఖకు చేకూరుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు 28 లక్షల రూపాయల వ్యాపారం చంచల్‌గూడ బంకు, 8 లక్షలు దేవరకొండ, 3 లక్షలు మిర్యాలగూడ బంకులో జరుగుతున్నదన్నారు. సుమారు 250 మంది ఖైదీలకు పెట్రోల్ బంకులు, స్టాళ్లలో ఉపాధి చూపామని, వారికి నగరంలోనైతే 15 వేల రూపాయలు, పట్టణాల్లోనైతే 12 వేల రూపాయలు వేతనం చెల్లిస్తున్నామన్నారు. నాణ్యత, పరిమాణాల్లో తేడా రాకుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కేంద్ర, జిల్లా జైళ్లలో సుమారు 41 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నామన్నారు. పచ్చళ్లు, కారం, గోధుమ, జొన్న పిండి, ఫర్నిచర్, దుస్తులు, బట్టలు తదితర వస్తువులు స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నామన్నారు. అదేవిధంగా తమ ఉత్పత్తులు కావాల్సిన వారు ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ కూడా చేస్తామన్నారు. నేరాలు అదుపులేకుండా చేస్తూ జైలుకు వస్తున్న వారికి జిల్లా జైలులో మానసిక శాస్తవ్రేత్తలతో కౌనె్సలింగ్ ఇస్తున్నామని, వారిలో మార్పులు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. జైళ్లలో సుమారు 3 లక్షల మొక్కలు హరిత హారం కింద నాటాలని నిర్ణయించామని, అదే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం జైళ్లశాఖ సిబ్బంది క్వార్టర్స్‌లో సిటీజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. స్థానిక సబ్ జైలు సూపరింటెండెంట్ నాగరాజు, ఫోరం బాధ్యులు అచ్యుతరావు, ఎల్.రాము, ఫణి, కిరణ్ పాల్గొన్నారు.

చిత్రం...మిర్యాలగూడలో జైళ్ల శాఖ పెట్రోల్ బంకును పరిశీలించి వినియోగదారుడితో
బంకు పనితీరుపై అడిగి తెలుసుకుంటున్న ఐజీ సైదయ్య