బిజినెస్

రెండు కంపెనీలుగా విడిపోనున్న ‘గెయిల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: సహజ వాయు ప్రాసెసింగ్, సరఫరాలను పర్యవేక్షించే అతిపెద్ద ప్రభుత్వ రంగ విభాగం ‘గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ’ (గెయిల్)ను విడగొట్టి ప్రత్యేక సంస్ధగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు వ్యూహాత్మక పెట్టుబడిదారులకు ఈ సంస్థ పైప్‌లైన్ నిర్వహణను విక్రయించి వాణిజ్య కార్యకలాపాలను పటిష్టవంతం చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సహజవాయు మార్కెటింగ్, వాణిజ్య కార్యకలాపాలను ప్రధానంగా నిర్వహించే ఈ సంస్థ పరిధిలో దేశంలో మూడింట రెండొంతుల పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉంది. మొత్తం 16,234 కిలోమీటర్ల పైప్‌లైన్ ఈ సంస్థ నిర్వహణలో ఉంది. ఐతే సుమారు 11,551 కిలోమీటర్ల మేర ఉన్న పైప్‌లైన్ నెట్‌వర్క్ పరిధిలో ఇంధనాన్ని రవాణా చేసుకోవడానికి వీలు లేకుండా ఉందని ఇతర సహజవాయు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపింది. దీంతో గెయిల్‌ను విడదీయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చిందని ఆ అధికారి తెలిపారు. ప్రత్యేకించి పైప్‌లైన్ వ్యవస్థ నిర్వహణను అధిక శాతం వాటాల విక్రయం ద్వారా ప్రత్యేక సంస్థకు అప్పగించాలని ప్రతిపాదన వచ్చింది. గెయిల్‌కు అమెరికా వంటి దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసి సరఫరా చేసేందుకు చాలాకాలంగా వివిధ కంపెనీలతో ఒప్పందాలున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మక పెట్టుబడిదారులు దీని నిర్వహణను చేపట్టేందుకు ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేసి సరఫరా చేయడం క్లిష్టతరమైంది. దీంతో ఇందుకు సంబంధించి పాత విధానానే్న కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. పైగా పైప్‌లైన్ నిర్వహణను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించారు. గెయిల్ నుంచి అధిక శాతం వాటాలను వ్యూహాత్మక పెట్టుబడిదారుకు అప్పగించాలన్న అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) కంపెనీ ఆధ్వర్యంలోని 1,480 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్వహణను చేపట్టిన కెనడాకు చెందిన ఆస్తుల నిర్వహణ కంపెనీ ‘బ్రూక్‌ఫీల్డ్’తో సైతం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని తెలిసింది. ఈ వ్యూహాత్మక భాగస్వామి పైప్‌లైన్‌ను నిర్వహిస్తూ పక్షపాత రహితంగా ఏ సంస్థ వచ్చి అడిగినా సంబంధిత సహజవాయు క్షేత్రాలకు, లేదా ఎల్‌ఎన్‌జీ దిగుమతి టెర్మినల్‌కు అక్కడి నుంచి వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇలా గెయిల్‌ను రెండు కంపెనీలుగా విడగొట్టడం ద్వారా వాణిజ్య నిర్వహణ క్రమబద్ధం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2030 నాటికి దేశంలో సహజ వాయు వినియోగాన్ని ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 15 శాతానికి పెంచాలన్న లక్ష్య నిర్ధేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.