బిజినెస్

లాభాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 15: హెవీ వెయిట్స్ సూచీలు భారీ లాభాలను నమోదు చేయడంతోబాటు ఇన్ఫోసిస్, ఇతర కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలు దేశీయ మార్కెట్లను అధికంగా ప్రభావితం చేశాయి. దీంతో సోమావారం సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఉదయం నుంచి సానుకూలంగా ఆరంభమైన మార్కెట్లలో బీఎస్‌సీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 327 పాయింట్లు ఎగబాకింది. ఐతే ఆ తర్వాత 160.48 పాయింట్ల ఆధిక్యతతో 0.41 శాతం లాభాలతో 38,896.71 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39,023.97 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 38,696.60 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35.85 పాయింట్ల ఆధిక్యతతో 0.31 శాతం లాభాలతో 11,588.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,618.40 పాయింట్ల గరిష్టాన్ని, 11,532.30 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఇన్ఫోసిస్ అత్యధికంగా 7.20 శాతం లాభపడింది. త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతోనే మదుపర్లు సానుకూలంగా స్పందించారని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఈ సంస్ధ ఊహించినదానికంటే 5.3 శాతం అధిక లాభాలను గడచిన త్రైమాసికంలో నమోదు చేసింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సర ఆదాయ అంచనాలను సైతం పెంచింది. ఈ సంస్థ పోటీదారు టీసీఎస్ సైతం 1.77 శాతం లాభపడింది. అలాగే సన్‌పార్మా, టెక్ మహీంద్రా, మారుతి, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ సైతం 3.61 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హీరోమోటోకార్ప్ 2.28 శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్ లాభాల క్రమంలో టోకు ధరల ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో తగ్గుముఖం పట్టి జూన్‌లో 23 నెలల కనిష్ట స్ధాయి 2.02 శాతానికి తగ్గిందని వాణిజ్య వర్గాలు తెలిపాయి. అలాగే ఆహార వస్తువుల బాస్కెట్ జూన్‌లో స్వల్ప స్థాయిలో సరళతరమై 6.99 శాతానికి చేరింది. మేలో ఇది 8.99 శాతంగా ఉంది. ఇక కూరగాయల ద్రవ్యోల్బణం సైతం 33.15 శాతం నుంచి 24,76 శాతానికి తగ్గింది. ఇక ఆసియా దేశాల్లో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సంగ్, నిక్కీ లాభాలను నమోదు చేయగా, కోస్పి నష్టపోయింది. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ వాణిజ్యంలో నష్టాలనే నమోదు చేశాయి.
బలపడిన రూపాయి..
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం ఇంట్రాడేలో 17 పైసలు పెరిగి 68.52 రూపాలుగా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 0.42 శాతం పెరిగాయి. బ్యారెల్ 67 డాలర్లు పలికింది.