బిజినెస్

బొగ్గు సరఫరాకు సింగిల్ లైన్ సరిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: దామరచర్లలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి అవసరమైన బొగ్గు సరఫరా కోసం రైల్వేలైన్‌ను డబుల్ లేన్‌గా మార్చాలని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. దామరచర్ల విద్యుత్ కేంద్రానికి సింగరేణి నుంచే మొత్తం బొగ్గును తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సౌధలో సోమవారం దక్షిణమధ్య రైల్వే అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కొత్తగూడెం నుంచి డోర్నకల్ వరకు మోటమారి నుంచి విష్ణుపురం వరకు 200 కిలో మీటర్ల మేర డబుల్ లేన్ నిర్మించాలని ప్రభాకర్‌రావు కోరారు. దామరచర్ల విద్యుత్ కేంద్రం నిర్మాణం శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో రైల్వే డబుల్ లేన్ నిర్మాణం కూడా జరగాలన్నారు. దామరచర్ల, భద్రాద్రి, కేటీపీసీ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా చేసేందుకు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లు, భవిష్యత్‌లో నిర్మించాల్సిన లైన్లపై రైల్వే అధికారులతో చర్చించారు. డోర్నకల్-విజయవాడ, బీబీనగర్-నడికుడి లైన్లను కలుపుతూ మోటుమారి, విష్ణుపురి రైల్వే స్టేషన్ల మధ్య సింగిల్ లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. అదే మార్గం ద్వారా నల్లగొండ జిల్లాలో ఉన్న సిమెంట్, లైమ్ స్టోన్ పరిశ్రమలకు బొగ్గు సరఫరా జరుగుతుందన్నారు. విష్ణుపురికి సమీపంలో ఉండే దామరచర్ల విద్యుత్ కేంద్రానికి కూడా ఇదే మార్గం ద్వారా బొగ్గు సరఫరా చేయాలని దక్షిణ మధ్య రైల్వే, జెన్‌కోలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లేన్ ఉండటంతో దీనిని డబుల్ లేన్‌గా మార్చాలని జెక్‌కో చేసిన సూచనకు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మేనేజర్ కె శివప్రసాద్ సానుకూలంగా స్పందించారు. దామరచర్ల విద్యుత్ కేంద్రానికి ప్రతీరోజు 50 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని ప్రభాకర్‌రావు సూచించారు. ఇంత పెద్ద మొత్తంలో బొగ్గు సరఫరా జరగాలంటే డబుల్ లేన్ ఉంటేనే సాధ్యపడుతుందని ప్రభాకర్‌రావు వివరించారు. కాజీపేట-బల్లార్షా మార్గంలో ఉప్పల్ నుంచి ప్రస్తుతం భూపాలపల్లి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా జరుగుతోంది. ఈ లేన్ చెన్నై-్ఢల్లీ మార్గంలోనే ఉండటంతో ఇతర రైళ్లకు అంతరాయం కలుగుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఉప్పల్ నుంచి భూపాలపల్లికి ప్రత్యేక రైలు మార్గం నిర్మించడమో, లేక ఉప్పల్ స్టేషన్‌కు కొద్ది దూరంలో రైల్వే ట్రాక్ నిర్మించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకోవడమో జరగాలని విద్యుత్, జెన్‌కో అధికారులు నిర్ణయించారు.
దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ప్రభాకర్‌రావు తెలిపారు.

చిత్రం... రైల్వేలైన్లపై సమీక్షిస్తున్న సీఎండీ ప్రభాకర్ రావు