బిజినెస్

‘యాంటీ డంపింగ్’ పేరిట ప్రత్యేక సుంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: చైనా, వియత్నాం, కొరియాల నుంచి దిగుమతి అవుతున్న అల్యూమినియం, జింక్ పూతకలిగిన వస్తువులపై ‘యాంటీ డంపింగ్ డ్యూటీ’ పేరిట ప్రత్యేక సుంకాన్ని ప్రతి టన్నుకు 199 డాలర్ల మేర విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జెఎస్‌డబ్ల్యు స్టీల్ కోటెడ్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చిన ఫిర్యాదుల క్రమంలో ఈ మంత్రిత్వ శాఖకు చెందిన పరిశోథనా విభాగం ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్’ (డీజీటీఆర్) దానిపై పరిశీలన జరిపి వాస్తవాలను నిగ్గుదేల్చింది. సాధారణంగా అల్యూమినియం, జింక్ పూత కలిగిన ప్లాట్ ఉత్పత్తులను వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో, సౌర విద్యుత్ ప్లాంట్లు, పైకప్పులు, వైట్‌గూడ్స్‌ల్లో వినియోగించడం జరుగుతోంది. కాగా కాలవ్యవధి దిగుమతుల పేరిట ఆ మూడు దేశాల నుంచి ఈ తరహా దిగుమతల శాతం అధిక స్థాయికి చేరిందని డీజీటీఆర్ పరిశోధనలో తేలింది.
అంతేకాక ఆ వస్తువులు సంబంధిత దేశాలు చూపిన నాణ్యతతో లేకపోవడం, నాసిరకంగా ఉండటం వల్ల వాటిని వాడితే త్వరగా విరిగిపోతున్నాయని, ఇలా పాడైన వస్తువుల డంపింగ్ శాతం కూడా పెరుగుతోందని వెల్లడైంది. ఈ కారణంతో వీటివల్ల అమాయక ప్రజలు గాయాలపాలయ్యే అవకాశాలు నెలకొన్నాయని, అందువల్ల దీనిపై ప్రత్యేక సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సంకం పరిమితి 28.67 నుంచి 199.53 డాలర్ల వరకు ఉండవచ్చని సూచించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) నిబంధనల మేరకే ఇందుకు సంబంధించిన విచారణ, సుంక నిర్థారణ జరిగాయని డీజీటీఆర్ స్పష్టం చేసింది.