బిజినెస్

చమురు, సహజ వాయువు ఉత్పత్తులు పెరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: దేశీయంగా చమురు, సహజ వాయుల ఉత్పత్తులను పెంచుకోవాలన్న మనదేశ అంచనాలు సత్ఫలితాలివ్వకపోవడంతో తాజాగా కొన్ని మార్పులతో చేపట్టిన టెండరు విధానం అంతర్జాతీయంగాప్రభావితం చేసే అవకాశాలున్నాయని సహజ వనరుల సంప్రదింపుల సంస్ధ ‘వుడ్ మెకన్జీ’ నివేదిక బుధవారం నాడిక్కడ పేర్కొంది. చమురు బావుల తవ్వకానికి సంబంధించి భూమి విస్తరణ ప్రాతిపదికన ప్రాథమిక ఆమోదాలు ఇచ్చే విధానానికి గత ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేకించి దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త విధానం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా ఆహ్వానించిన మూడు రౌండ్ల వేలం పాటలకు అంతర్జాతీయ సంస్థలన్నీ దూరంగా ఉన్నాయి. దేశీయ చమురు, సహజ వాయు సంస్థల నుంచి అతిపెద్ద రెవిన్యూ షేర్‌ను ప్రభుత్వం ఆఫర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా ఉంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఆయిల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)తోబాటు ప్రైవేటు రంగానికి చెందిన వేదాంత లిమిటెడ్ కు చెందిన మొత్తం 32 బ్లాక్‌లకు సంబంధించిన కాంట్రాక్టులు అప్పగించేందుకు తాజాగా చేపట్టాల్సిన వేలం పాటలకు మంగళవారం ఆమోదం లభించింది. బహిరంగ భూ విస్తరణ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ)కి సంబంధించి తొలి విడత వేలం పాటల ప్రక్రియ దీంతో ముగుస్తుందని తెలిసింది. ఈ క్రమంలో ఆదాయ మార్గాలకంటే ఈ దఫా పని కార్యాచరణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని నివేదిక తెలిపింది. ఈప్రయత్నం ఫలించే అవకాశాలున్నాయని, అయితే గట్టిపోటీ ఉన్న అంతర్జాతీయ మార్కెట్లో ఇతర దేశాల బడ్జెట్లను తగ్గించేలా ఉన్న భారత్ ఆఫర్‌కు ఏమేరకు స్పందన ఉంటుందో చూడాల్సివుందని నివేదిక తెలిపింది. మార్కెటింగ్‌తోబాటు ధరలపై పూర్తి స్వేచ్ఛతో కూడిన కొత్త లైసెన్సింగ్ విధానంతో ఓఏఎల్‌పీ 4వ రౌండ్ బిడ్‌ను ఈనెల, లేదా ఆగస్టులో నిర్వహించనున్నారు. కేటగిరీ-1 విభాగంలో ఇప్పటికే కృష్ణా గోదావరి, ముంబయి ఆఫ్‌షోర్, రాజస్థాన్, అస్సాంలలో వాణిజ్యపరమైన ఉత్పత్తులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. 70:30 పనుల నిర్వహణ, ఆదాయ షేర్ నిష్పత్తిలో బిడ్లు విడుదల కానున్నాయి.