బిజినెస్

స్వల్పంగా పెరిగిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 17: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో బుధవారం వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగాయి. అటు భారీ లాభాలు గానీ, ఇటు భారీ నష్టాలు గానీ లేకుండా ట్రేడింగ్ కొనసాగింది. చివరికి సెనె్సక్స్ 84.60 పాయింట్లు పెరిగి 39,215.64 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని విశే్లషకులు ఊహించారు. అయితే, ప్రారంభంలో వివిధ కంపెనీల షేర్లు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపారు. దీంతో మొదటి రెండున్నర గంటల ట్రేడింగ్ లాభాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే, చివరిదశలో మళ్లీ పుంజుకోవడంతో స్వల్ప లాభంతో ట్రేడింగ్ ముగిసింది. టెక్ మహీంద్ర షేర్ ధర 2.31 శాతం పెరిగింది. అదేవిధంగా ఎస్‌బీఐ (2.17 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (2.06 శాతం), కొటక్ మహీంద్ర (2.02 శాతం), ఇండస్‌ఇండ్ (1.85 శాతం) షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. కాగా, ఎస్ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఈ కంపెనీ షేర్లు 5.25 శాతం పతనమయ్యాయి. ఓఎన్జీసీ (1.64 శాతం), మారుతి సుజుకీ (1.38 శాతం), బజాజ్ ఆటో (1.36 శాతం), ఎన్‌టీపీసీ (1.30 శాతం) షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రారంభంలో లాభాలు, ఆ తర్వాత నష్టాలు, చివరికి స్వల్ప లాభంతో ట్రేడింగ్ ముగిసింది. ఇండియా బుల్స్ షేర్ల ధర 2.75 శాతం పెరిగింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 2.60 శాతం, యూపీఎల్ 2.51 శాతం, హిందాల్కో 2.41 శాతం, ఎస్‌బీఐ 2.37 శాతం చొప్పున లాభాలు ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలో కూడా ఎస్ బ్యాంక్ షేర్లు గణనీయంగా పతనం కావడం గమనార్హం. ఇక్కడ కూడా ఈ షేర్ల ధర 5.25 శాతం పతనమైంది. ఇచర్ (2.95 శాతం), గెయిల్ (2.75 శాతం), మారుతి సుజుకీ (1.61 శాతం), ఓఎన్‌జీసీ (1.51 శాతం) కూడా నష్టాలను చవిచూశాయి.