బిజినెస్

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. హెవీవెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటాకనె్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీవ్ర స్థాయిలో వాటాల విక్రయ వత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌సీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 318.18 పాయింట్లు కోల్పోయి 0.81 శాతం నష్టాలతో 38,897.46 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 38,861.25 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 39,204.47 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 90.60 పాయింట్లు కోల్పోయి 0.78 శాతం నష్టాలతో 11,596.90 పాయింట్ల దిగువన స్ధిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ మారు 11,582.40 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 11,677.15 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంకు భారీగా 12.85 శాతం నష్టపోయింది. ఈ కంపెనీ లాభాల్లో 92.44 శాతం తగ్గుదల నమోదై రూ. 95.56 కోట్లకు పరిమితం కావడం స్టాక్‌మార్కెట్లో ఈ కంపెనీ వాటాలపై ప్రభావం చూపింది. అలాగే ఓఎన్‌జీసీ, టాటామోటార్స్, ఎం అండ్ ఎం, మారుతి, వేదాంత, బజాజ్ ఆటో, టీసీఎస్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్ సైతం 4.24 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ 2.26 లాభాలతో అగ్రగామిగా నిలిచింది. అలాగే కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ 0.31 శాతం లాభపడ్డాయి. హెవీ వెయిట్స్ ఆర్‌ఐఎల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, మారుతి వాటాలు తీవ్ర స్థాయిలో అమ్మకాల వత్తిడిని ఎదుర్కొని స్టాక్‌మార్కెట్లను నష్టాల్లోకి లాగాయని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లాభపడటం నష్టాలకు కొంత వరకు అడ్డుకట్టవేసిందని అంటున్నారు. ఆసియా, ఐరోపా మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలు కూడా దేశీయ మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేశాయన్నారు.
విదేశీ మార్కెట్లదీ అదేతీరు
ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ 1.04 శాతం నష్టపోగా, హ్యాంగ్‌సెంగ్ 0.46 శాతం, కోస్పి 0.31 శాతం, నిక్కీ 1.97 శాతం వంతున నష్టపోయాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే చవిచూశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం 12 పైసలు తగ్గి ఇంట్రాడేలో రూ.68.69గా ట్రేడైంది. ముడిచమురు ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో 0.33 శాతం వృద్ధితో 63.87 డాలర్లుగా ట్రేడైంది.