బిజినెస్

పెట్రో అవసరాలు తీరాలంటే శుద్ధి సామర్థ్యం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో విద్యుత్ వాహనాలను పెద్ద సంఖ్యలో వినియోగించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ అవసరాలు తీరాలంటే దీని శుద్ధి సామర్థ్యాన్ని భారతదేశం 80 శాతం వరకు పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఇంధన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ‘విద్యుత్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నది మంచి నిర్ణయమే అయినా అదే సమయంలో ఇపుడున్న అల్ట్రా క్లీన్ బీఎస్-6 గ్రేడ్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, బయోప్యూయెల్‌లో సైతం అవసరాలను గుర్తించాలి’ అని ఎనర్జీ హారిజన్-2019 పేరిట ఇక్కడ శుక్రవారంనాడు ప్రారంభమైన సదస్సులో మంత్రి పేర్కొన్నారు. పరిశుద్ధమైన డీజిల్, పెట్రోల్, కంప్రెష్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), బయోఫ్యూయెల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఈవీ)లు వంటివి రవాణా అవసరాలను తీర్చిదిద్దగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ వాహనాల రంగంలో వౌలిక సదుపాయాలు అభివృద్ధిపరచడంతోపాటు ఇందుకు తగిన మద్దతు, ప్రచారాన్ని ఆశించడం మంచి పరిణామమైనా అదే సందర్భంలో రవాణా సమస్యలను అధిగమించేందుకు గల ఇతర ప్రత్యామ్నాయ మార్గాల పాత్ర ఆవశ్యకతను గుర్తెరగాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశం ఇపుడు క్రూడాయిల్‌ను శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని, దీని ద్వారా ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్ వాటిని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్‌లో ప్రతి సంవత్సరం 250 మిలియన్ టన్నుల దేశవాళీ శుద్ధి సామర్థ్యం కలిగి ఉంది. ఇటీవల జరిగిన పరిశోధన ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగం ఊహించని రీతిలో పెరిగేకొద్దీ 2040 నాటికల్లా 450 మిలియన్ టన్నుల శుద్ధి సామర్థ్యానికి భారత్ చేరుకుంటుంది’ అని కేంద్ర ఇంధన మంత్రి ధర్మేంద్ర ప్రధాన పేర్కొన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వస్తున్న డిమాండ్‌నున దృష్టిలో ఉంచుకుంటే కొనే్నళ్లలో క్రూడాయిల్‌తోపాటు శుద్ధి చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది’ అని ఆయనఅభిప్రాయపడ్డారు. శుద్ధి చేసిన ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి ప్రోత్సాహం కల్పించేందుకు తగిన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.

2030కల్లా దేశంలో విద్యుత్ వాహనాల విక్రయాలు మాత్రమే జరుగుతాయని నీతి ఆయోగ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. 2025 నుంచి 150 సీసీ సామర్థ్యం కలిగిన ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు జరుగుతాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ అధ్యక్షతన గల ప్యానల్ కమిటీ సూచించిన విషయం తెలిసిందే.