బిజినెస్

బ్యాంకింగ్ రంగం ఎన్నో సవాళ్ళను, సమస్యలనూ ఎదుర్కొంటోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, జూలై 20: దేశ వ్యాప్తంగా బ్యాంకిం గ్ రంగం ఎనె్నన్నో సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటున్నదని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆందోళన వ్య క్తం చేశారు. శనివారం నాగ్‌పూర్‌లో ఇండియన్ బ్యాంకు జోనల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి గడ్కరి ప్రసంగిస్తూ ప్రజలు బ్యాంకులకు ఎప్పటికప్పుడు అంటే గడువులోగా తమ బకాయిలను చెల్లించాలన్నారు. రుణా లు తీసుకున్న వారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం అనేది కూడా బ్యాంకులకు పరీక్షగానే పరిణమించాయని అన్నారు. మైక్రో, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) 59 నిమిషాల్లోనే రుణాలు మంజూరు చే యాలని ప్రధాని మోదీ ఇదివరకే చెప్పారని గడ్కరీ గుర్తు చేశారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారి కి వెంటనే లభిస్తాయన్నారు. వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఉన్న రుణాలను వెంటనే విడుదల చేయాలని ఆయన బ్యాంకులకు సూచించారు. హ్యాండ్లూమ్, చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు వీలుగా ఎంఎస్‌ఎంఇ కింద రుణాలు మంజూరు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెం చాల్సిందిగా మంత్రి గడ్కరీ కోరారు. విదర్భలో రెడీమేడ్ దుస్తుల తయారీ, ఎగుమతులకు సోలార్ చక్ర క్లస్టర్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.