బిజినెస్

345 వౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: దేశంలో 345కు పైగా వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అధిక నిర్వహణ ఖర్చు అంచనాలతో సతమతమవుతున్నాయి. ఈ కంపెనీలు ఒక్కొక్కటి సుమారు రూ. 150 కోట్ల చేసేవికాగా మొత్తం రూ. 3.28 లక్షల కోట్ల అదనపుఖర్చు అంచనాల భారాన్ని అవి నమోదు చేశాయి. ఈ పరిస్థితికి ప్రధానంగా కొనుగోళ్లలో జాప్యం తదితరాలను ఆ ప్రాజెక్టుల ఏజెన్సీలు చూపుతున్నాయి. మొత్తం 1453 ప్రాజెక్టుల ఏర్పాటుకు వాస్తవ ఖర్చు అంచనాలు రూ. 18,32,579.17 కోట్లుకాగా అయితే అవి పూర్తికావడానికి రూ. 21,61,313.18 కోట్లు ఖర్చవుతుందని తాజా అంచనాలు తేల్చాయి. ఈక్రమంలో వాస్తవ ఖర్చు అంచనాలకంటే రూ. 3,28,734.01 కోట్లు (17.94శాతం) అదనంగా పెరిగాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమ లు మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్‌లో సమర్పించిన నివేదిక ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మంత్రిత్వ శాఖ రూ. 150 కోట్లు అంతకంటే అధిక ఖర్చుకాగల ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుంది. ఈప్రాజెక్టు పరిధిలోని మొత్తం 1,453 ప్రాజెక్టుల్లో 345 ప్రాజెక్టులు తాజాగా అధిక ఖర్చు అంచనాలను చూపాయి. ఈప్రాజెక్టుల ఖర్చు 2019 ఏప్రిల్ నాటికి రూ. 8.84.906.88 కోట్లకు చేరింది. అంటే ముందుగా వేసిన అంచనాలకంటే ఇది 40.94 శాతం అధికం. ఇలా నిర్మాణంలో ఆలస్యం కారణంగా ఖర్చు అంచనాలు పెరిగిన ప్రాజెక్టుల సంఖ్య వాస్తవానికి ఈ ఏడాది తగ్గుముఖం పట్టి 317కు చేరిందని నివేదిక వెల్లడించింది. 798 ప్రాజెక్టులు నిర్మాణ ప్రారంభ సమయాన్ని ఎప్పటికి పూర్తవుతాయన్న విషయాన్ని సమూలంగా తెలియజేశాయి. మొత్తం 388 ఆలస్యమైన ప్రాజెక్టుల్లో 121 పూర్తి స్థాయిలో ఆల స్యం చోటుచేసుకున్నవిగా (ఒకటి నుంచి 12 నెలల ఆలస్యం) నమోదు కాగా, 78 ప్రాజెక్టులు 13 నుంచి 24 నెలల కాలం, 98 ప్రాజెక్టులు 25 నుంచి 60 నెలలు, 91 ప్రాజెక్టులు 61 నెలల ఆపైన ఆలస్యమైనట్టు నివేదిక స్పష్టం చేసింది. 388ప్రాజెక్టుల కనీస అదనపు జాప్యం 40.20 నెలలుగా నమోదైంది. ప్రాజెక్టుల ఆలస్యానికి భూ సేకరణ, అటవీ శాఖ క్లియరెన్సు వంటివి కారణాలుగా సంబంధిత ఏజెన్సీలు పేర్కొన్నాయి. అలాగే నిధు ల జాప్యం, వైపరీత్యాలు, తవ్వకానికి ప్రతికూలతలు, మట్టిపను ల్లో మందగమనం, కార్మికుల కొరత, కాంట్రాక్టర్లు సహకరించకపోవడం, మావోయిస్టుల సమస్య, న్యాయ పరమైన చిక్కులు వంటి సమస్యల కారణాలను సంబంధిత ఏజెన్సీలు చూపా యి. కాగా పలు ప్రాజెక్టుల ఏజెన్సీలు సవరించిన ప్రాజెక్టు ఖర్చు అంచనాలను, ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాలను తెలియజేయలేదని మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.