జాతీయ వార్తలు

34 నదుల శుద్ధికి రూ.5870 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: గంగానది మినహా 16 రాష్ట్రాల్లోని కాలుష్యమయమైన 34 నదులను ప్రక్షాళన చేయడానికి రూ. 5,870 కోట్ల నిధులు మంజూరైనట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ (ఎన్‌ఆర్‌సీపీ) కింద మంజూరైన మొత్తం రూ. 5,870 కోట్లలో కేంద్రం తన వాటా కింద రూ. 2,522 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో ఇటీవల లోక్‌సభకు తెలిపారు. ‘వివిధ నదుల పొడవున ఉన్న పట్టణాలలో కాలుష్యాన్ని తగ్గించే పనులు చేపట్టడానికి రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు అందాయి. ఎన్‌ఆర్‌సీపీ కింద ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది’ అని ఆయన తెలిపారు. ‘16 రాష్ట్రాలలోని 77 పట్టణాల మీదుగా ప్రవహిస్తున్న 34 నదులకు చెందిన కాలుష్య పరీవాహక ప్రాంతాలను శుద్ధి చేయడానికి ఎన్‌ఆర్‌సీపీ కింద రూ. 5870.55 కోట్లు మంజూరు చేయడం జరిగింది’ అని బాబుల్ సుప్రియో సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.