బిజినెస్

పేద గిరిజనులకు జీసీసీ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : విద్యావంతులైన పేద, మధ్యతరగతి గిరిజన యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది త్వరలో అమల్లోకి రానుంది. ఫ్రాంచైజ్ ఔట్‌లెట్లను నిర్వహించేందుకు సంస్థ యాజమాన్యం వీరికి అవకాశం కల్పించనుంది. వీటిద్వారా గిరిజన యువతను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమిస్తుంది. జీసీసీ బ్రాండ్‌తో అందుబాటులోకి తీసుకువచ్చే అటవీ ఉత్పత్తులను ఈవిధంగా అమ్మాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ వీటిని నిర్వహించడం ద్వారా సంస్థ ఆదాయంతోపాటు పేద గిరిజనులకు ఉపాధిని మెరుగుపరిచినట్టు అవుతుందని యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా వలసలు తగ్గడం, విద్యావంతులైన గిరిజనులు కనీసం ప్రతినెల పదివేల నుంచి 15వేల రూపాయల వరకు ఉన్నచోటనే సంపాదించుకునే అరుదైన అవకాశం లభిస్తుందనేది జీసీసీ యాజమాన్యం ఆలోచన. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, చిత్తూరు, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో దిగుబడి అయ్యే జొన్నలు, రాగులు, కొర్రలు,మొక్కజొన్న వంటి చిరుధాన్యాలతోపాటు తేనె, త్రిఫల, పౌష్టికాహారంతో కూడిన మల్టీ విటమిన్ బిస్కట్లు, అరకు కాఫీ, సబ్బులు తదితర 30 రకాలైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్ అమ్మకాలకు విశేష ఆదరణ లభిస్తోంది. జీసీసీ బ్రాండ్‌తో కూడిన ఉత్పత్తులను అమ్మడం కోసం ఎక్కడికక్కడ పంపిణీదారీ వ్యవస్థను సంస్థ పటిష్టపరుస్తూనే మరోపక్క పేద గిరిజనుల కోసం ఇప్పటికే పెట్రోల్ బంక్‌లను నిర్వహించగలుగుతోంది. ఏపీలో నాలుగైదు జిల్లాలకు సంబంధించి ఏకంగా 16 పెట్రోల్ బంక్‌లు నిర్వహిస్తూ వీటిద్వారా దాదాపు 100మందికి ఉపాధిని కల్పించగలిగిన సంస్థ ఇప్పుడు ప్రాంచైజ్‌ల ద్వారా ప్రతి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన యువతకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించాలని ఇప్పటికే కార్యచరణ రూపొందించింది. దీనిని ప్రతిచోట పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కాగా ప్రతి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో కంటే కూడా విద్యావంతులైన గిరిజన యువతీ, యువకులు ఉన్నత విద్యను అభ్యసించి మెరుగైన ఉపాధి అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నారు. అలాగే పేద, మధ్యతరగతికి చెందిన మరికొంతమంది గిరిజన యువకులు చేసేదిలేక చిన్న,చిన్న ఉద్యోగాల కోసం పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. మొత్తం మీద విద్యావంతులైన గిరిజనులు, కాస్తంత చదువుకుని గిరిజనులు ఉన్నచోట నుంచి వెళ్లిపోతున్న పరిస్థితులను గుర్తించిన జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్-చైర్మన్ టీ.బాబూరావునాయుడు ఇకనుంచి ఈతరహా వలసలను పూర్తిస్థాయిలో నిరోధించడం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన ఆయన త్వరలో దీనికి సంబంధించి కొంతమందికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను ఆయా అధికారులకు అప్పగించారు. తొలుత జిల్లాలవారీగా నిరుద్యోగ యువతను గుర్తించడం తదుపరి అర్హత మేరకు అవకాశం కల్పించనున్నారు.