బిజినెస్

వరుస నష్టాలతో స్టాక్ మార్కెట్లు సతమతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 22: దేశీయ సాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజైన సోమవారం సైతం పెద్ద మొత్తాల్లో నషాలపాలయ్యాయి. సెనె్సక్స్ రెండు నెలల కనిష్ట స్థాయికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, శీఘ్ర విక్రయ వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ) సాక్స్ తీవ్ర నష్టాలను చవిచూడటంతోబాటు, అంతర్జాతీయ ప్రతికూలతలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగాప్రభావితం చేశాయని విశే్లషకులు అంచనా వేశారు. అలాగే భారీగా సాగిన విదేశీ వాటాల విక్రయం, రూపాయి విలువ బలహీనపడటం కూడా దేశీయ మార్కెట్లను నిర్దేశించాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 18 నుంచి ఇప్పటి వరకు సెనె్సక్స్ మొత్తం 3.05 శాతం నష్టాలతో 1,184.15 పాయింట్లు నష్టపోయింది. బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 305.88 పాయింట్లు కోల్పోయి 0.80 శాతం లాభాలతో 38,031.13 పాయింట్ల దగువన స్థిరపడింది. ఈ సూచీ తొలుత 37,890.32 పాయింట్ల కనిష్ట స్థాయిని, తర్వాత 38,333.52 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 82.10 పాయింట్లు కోల్పోయి 0.72 శాతం నష్టాలతో 11,337.15 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 11,301.25 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 11,398.15 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికంగా 5.09 శాతం, 3.32 శాతం వంతున నష్టపోయాయి. ఈ ప్రైవేటు బ్యాంకు త్రైమాసిక ఫలితాల్లో నిరర్థక ఆస్తులు మొత్తం రుణాల్లో 1.40 శాతమని ఈ ఆస్తుల విలువ రూ. 11,768.95 కోట్లకు చేరిందని పేర్కొనడం మార్కెట్‌లో ఆ బ్యాంకు వాటాల విలువను దెబ్బతీసిందని విశే్లషకులు తెలిపారు. అలాగే ఈ బ్యాంకు నాన్‌బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి నిలిపినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు 1.33 శాతం అంటే రూ. 9,538.62 కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులను ప్రకటించడం జరిగింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్ సైతం 1.33 శాతం నష్టపోయాయి. అలాగే ఎస్ బ్యాంకు అత్యధికంగా 9.49 శాతం లాభపడింది. అలాగే వేదాంత, ఆర్‌ఐఎల్, ఏసియన్ పెయింట్స్, మారుతి, సన్‌పార్మా సైతం 3.85 శాతం లాభపడ్డాయి. విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు)లకు ఆదాయ పన్ను సర్‌చార్జి మినహాయింపు విషయంలోప్రభుత్వం మొండిపట్టు విడవకపోవడం వల్లే విదేశీ వాటాల విక్రయం భారీగా జరిగిందని ఆర్థిక నిపుణులు అభిప్రాపడుతున్నారు. అలాగే రుతుపవనాల ప్రభావం తగ్గడం, కార్పొరేట్ కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు సైతం మదుపర్ల రిస్క్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయంటున్నారు. కాగా నికరంగా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ. 950.15 కోట్ల విలువైన వాటాలు విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ. 733.92 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారని స్టాక్ ఎక్చేంజ్‌లో గత శుక్రవారం లభించిన గణాంకాలనుబట్టి విశదమవుతోంది. అలాగే ఆసియా దేశాల మార్కెట్లు సైతం సోమవారం నష్టాల పాలవడం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది. షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ సోమవారం నష్టాలతో ముగిశాయి.
రూపాయి బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం ఇంట్రాడేలో 17 పైసలు తగ్గి మొత్తం 68.97 రూపాలుగా ట్రేడైంది. ఐతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మాత్రం 2.15 శాతం వృద్ధితో బ్యారెల్ ధర 63.82 డాలర్లకు చేరింది. ఇరాన్‌కు చెందిన ఉద్యమకారులు అంతర్జాతీయ సముద్ర వనరుల నిబంధనలకు విఘాతం కలిగించే వ్యూహంతో గత శుక్రవారం ఓ బ్రిటీష్ చమురు ట్యాంకర్‌ను జప్తు చేయడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడిందని వాణిజ్య విశే్లషకులు పేర్కొన్నారు.