బిజినెస్

ఇక ప్రగతి పరుగులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 22: భారత ప్రభుత్వం చేపడుతున్న జీఎస్టీ వంటి వ్యవస్థీకృత సంస్కరణల వల్ల ఆర్థిక వృద్ధిరేటు ఇనుమడిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 8 శాతానికి పైగా ప్రగతి రథం పరుగులు పెడుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రాజీవ్‌కుమార్ ‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు’ అన్న అంశంపై జరిగిన సెమినార్‌లో మాట్లాడారు. న్యూయార్క్‌లోని భారత కాన్సలేట్ జనరల్ కార్యాలయంలో ఈ సెమినార్ జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధి రేటును ప్రస్తుత 7 శాతం నుంచి 8 శాతానికి పైగా సాధించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, వీటన్నింటి ఫలితంగా చాలా సునాయసంగానే ఐదు టిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించగలుగుతామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తెలిపారు. ‘2020-2021 ఆర్థిక సంవత్సరం నుంచి నిరంతరంగా భారత వృద్ధిరేటు 8 శాతానికి పైనే ఉంటుందని, ఇందుకు దోహదం చేసే అన్నీ గుణాత్మక చర్యలను భారత ప్రభుత్వం చేపడుతుందని పీటీఐకి ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఐదు టిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవస్థీకృతంగా బలమైన పునాదులు పడ్డాయని, జీఎస్టీతో పాటు దివాళాకోడ్ వంటి ఎన్నో సంస్కరణ ప్రయత్నాలు అన్ని విధాలుగా భారత వృద్ధిరేటు వేగవంతం కావడానికి దోహదం చేస్తాయన్నారు. రెండంకెల వృద్ధిరేటును సాధించడానికి అవసరమైన వ్యవస్థాగత పటిమ భారత్‌కు ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో భారత్‌లో ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని పేర్కొన్న ఆయన ‘ఉపాధి లేకుండా వృద్ధి సాధ్యమైతే అది సామాజిక అలజడులకు ఉద్రిక్తతలకు కారణమై ఉండేదే’ అని అన్నారు. అంతేకాదు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీతో ఎన్నికయ్యే అవకాశమే ఉండేది కాదని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వానికి ఇంతర భారీ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టడానికి కారణం ఆయన మొదటి అయిదేళ్ల పాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడమేనని తెలిపారు. అయితే, భారతదేశ యువత ఆశించినట్టుగా, వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా నాణ్యతయుతమైన ఉపాధి అవకాశాలు లేవన్న మాట నిజమేనన్న విషయాన్ని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అంగీకరించారు.
చిత్రం...నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్