బిజినెస్

వారసులొస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: దేశీయ పారిశ్రామికరంగ దిగ్గజాల వారసులు వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే వచ్చినవారు కొందరైతే, ఇప్పుడిప్పుడే వస్తున్నవారు మరికొందరు.. రావాల్సినవారు ఇంకొందరున్నారు. ప్రముఖ సంస్థల అధిపతులైన అంబానీలు, అదానీ, మిట్టల్, బిర్లా, సంఘ్వీ, పూనావాలా, నాడర్, పిరామల్, మూర్తి, ప్రేమ్‌జీలు తమ వారసులను పరిచయం చేశారు. అయితే వీరిలో తమ తండ్రులు స్థాపించిన సంస్థల పగ్గాలను కొందరు చేపడుతుండగా, మిగతావారు మాత్రం కొత్త సంస్థలను స్థాపిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానంలో కూతురు ఇషా, కుమారుడు ఆశాశ్ అంబానీ రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారు. మరో కుమారుడు అనంత్ అంబానీ సైతం వ్యాపార రంగంలోకి త్వరలోనే అడుగు పెట్టనున్నాడు. ఇక ముకేశ్ సోదరుడైన అనీల్ అంబానీ కూడా తన ఇద్దరు కుమారుల్లో ఒకరైన జై అన్‌మోల్‌ను ఇటీవలే వ్యాపార అరంగేట్రం చేయించారు. అదనపు డైరెక్టర్‌గా రిలయన్స్ క్యాపిటల్‌లోకి అన్‌మోల్ వచ్చాడు. మరోవైపు బహుళ వ్యాపార దిగ్గజం కుమార మంగళం బిర్లా తనయ అనన్యశ్రీ బిర్లా సొంతంగా మైక్రో ఫైనాన్స్ సంస్థను స్థాపించి నడిపిస్తున్నారు. దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ.. విప్రో సంస్థలో టెక్ విభాగం చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరో ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌సిఎల్ అధినేత శివ్ నాడర్ కుమార్తె రోషిణి నాడర్.. హెచ్‌సిఎల్ సారథ్యాన్ని భుజంపై వేసుకున్నారు. ఇకపోతే దేశీయ టెలికామ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా కొనసాగుతున్న ఎయిర్‌టెల్ మాతృ సంస్థ భారతీ ఎంటర్‌ప్రైజెస్ అధిపతి సునీల్ మిట్టల్ వారసుడు కెవిన్ మిట్టల్.. హైక్ మెసేంజర్‌ను సొంతంగా స్థాపించాడు. దీని విలువ 6,500 కోట్ల రూపాయల పైమాటే. అలాగే గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ కూడా తమ అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఇజెడ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తి తనయుడు రోహన్ మూర్తి కూడా ఇన్ఫోసిస్‌లో క్రీయశీల పాత్రను పోషిస్తున్నాడు. దేశంలోని సంపన్నుల్లో ఏడో స్థానంలో ఉన్న సైరస్ పూనవాలా కుమారుడు అడార్ సైరస్ పూనవాలా తమ సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యాపార విస్తరణ దిశగా దూసుకెళ్తున్నాడు. బిలియనీర్ అజయ్ పిరామల్ కొడుకు ఆనంద్ పిరామల్.. పిరామల్ రియల్టీని స్థాపించాడు. ముంబయి, దాని శివారు ప్రాంతాల్లోని నిర్మాణ రంగంపై దృష్టి పెట్టాడు. దేశీయ ఔషధరంగ దిగ్గజాల్లో ఒకటైన సన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత దిలీప్ సంఘ్వీ కుమారుడు అలోక్ సంఘ్వీ కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరునే తెచ్చుకుంటున్నాడు. మొత్తానికి ఇప్పటిదాకా దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వీరంతా ఇప్పుడు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో తమ సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త తరంతో దేశ వ్యాపార ముఖచిత్రం కొత్త పుంతలు తొక్కాలని ఆశిద్దాం.

చిత్రాలు.. తల్లిదండ్రులు
ముకేశ్ అంబానీ,
నితా అంబానీ
సంస్థ: రిలయన్స్ ఇండస్ట్రీస్
అనంత్ అంబానీ

తల్లిదండ్రులు
నారాయణ మూర్తి,
సుధా మూర్తి
సంస్థ: ఇన్ఫోసిస్
రోహన్ మూర్తి