బిజినెస్

23 వర్సిటీలు నకిలీవే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: ఉన్నత విద్యనభ్యసించేందుకు వివిధ విశ్వ విద్యాలయాల్లో చేరే విద్యార్థులు ఆ విశ్వ విద్యాలయాలకు గుర్తింపు ఉందా? లేదా? అవి నకిలీవా? అనే అప్రమత్తతో అడుగు వేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. దేశంలో 23 యూనివర్సిటీలు నకిలీవి అని, వాటికి తమ గుర్తింపు లేదని యూజీసీ మంగళవారం ప్రకటించింది. వీటిలో ఎనిమిది వర్సిటీలు ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఉన్నాయని యూజీసీ సెక్రటరీ రజనీష్ జైన్ తెలిపారు. ఇంకా ఢిల్లీలో ఏడు వర్సిటీలు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరిలో ఒక్కో నకిలీ వర్సిటీ ఉన్నట్లు ఆయన చెప్పారు. యూపీలోని వారణాసిలో గల వారణసేయ సంస్కృత్ విశ్వవిద్యాలయ, కాన్పూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంపెక్ల్స్ హోమియోపతి, అలీఘర్‌లోని నేతాజా సుభాష్ చంద్రబోస్ ఒపెన్ వర్సిటీ, మథురలోని ఉత్తర్ ప్రదేశ్‌లో విశ్వవిద్యాలయ, ప్రతాప్‌ఘర్‌లోని మహరాణా ప్రతాప్ శిక్షా నికేతన్, నోయిడాలోని ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్‌కు గుర్తింపు లేదని ఆయన వివరించారు. ఢిల్లీలో కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యూనైటెడ్ నేషన్స్ వర్సిటీ, వోకేషనల్ యూనివర్సిటీ, ఎడీఆర్-సెంట్రిక్ జ్యుడీషల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అథ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిట్చ్యువల్ వర్సిటీ), విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నకిలీవని ఆయన వెల్లడించారు. కర్నాటకలోని బడాంగ్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ వర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళలోని సెంట్ జాన్స్ యూనివర్సిటీ, మహారాష్టల్రోని రాజా అరిబిక్ యూనివర్సిటీ, పాండిచ్చేరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా నకిలీ అని ఆయన వివరించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఒక్కో నకిలీ వర్సిటీ ఉన్నట్లు తెలిపారు.