బిజినెస్

తిరుపతి నుంచి మలేషియాకు విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 23: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియా దేశానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు యత్నిస్తున్నామని మలేషియా బృందం వెల్లడించింది. మంగళవారం మలేషియా బృందం శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో విమానాశ్రయ అధికారులతో మలేషియాకు విమాన సర్వీసులు నడిపే విషయమై సమావేశం నిర్వహించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేష్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని మలేషియా బృందానికి తెలిపారు. అదేవిధంగా కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్ట్ తరపున నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం విమానాశ్రయం వెలుపల మలేషియా బృందం విలేఖరులతో మాట్లాడుతూ మలేషియా నుండి చెన్నై విమానాశ్రయానికి రోజూ 10 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. ఇందులో ముఖ్యంగా 40 నుంచి 60 శాతం శ్రీవారి భక్తులు దర్శనార్థం వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే భారత్‌లో పుణ్యక్షేత్రమైన తమిళనాడు తిరుచ్చికి మలేషియా నుంచి చెన్నైకు, చెన్నై నుంచి తిరుచ్చికి కనెక్టింగ్ విమానాలు నడుస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా తిరుపతి విమానాశ్రయం నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ లేదా త్రూ మలేషియా ఫ్లైట్ ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా నడుపుతామన్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో రేణిగుంట నుంచి మలేషియాకు అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేషియా బృందం సభ్యులు డాక్టర్ కమలేశ్వరన్ జో, డాక్టర్ రాజేశ్వరన్, డాక్టర్ విజయన్, డాక్టర్ ప్రభ, డాక్టర్ శేఖర్, రఘు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ఓవీ రమణ పాల్గొన్నారు.