బిజినెస్

జీసీసీ బ్రాండ్‌తో చిరుధాన్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: అటవీ ఉత్పత్తులకు విశేష ఆదరణ తెచ్చిపెడుతున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇపుడు సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగించడంపైనే వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్న మానవాళి ఇపుడు సహజ సిద్ధమైన చిరుధాన్యాలవైపు చూస్తోంది. దీనిని జీసీసీ అవకాశంగా చేసుకుంటోంది. ప్రతిఒక్కరూ కోరుకునే చిరుధాన్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం గిరిజన రైతులను ప్రోత్సహిస్తూనే వారి నుంచి జొన్నలు, కొర్రలు, సామలు, ఊదలు, గంటెలు వంటివి కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పాడేరు, సీతమ్మపేట, పార్వతీపురం, రంపచోడవరం ప్రాంతాల్లో చిరుధాన్యాలు పండించే గిరిజన రైతులు ఎక్కువుగా ఉన్నట్టు జీసీసీ గుర్తించింది. అందువల్ల తొలుత ఈ ప్రాంతాల్లో చిరుధాన్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్న వీరిని ప్రోత్సాహించాలని నిర్ణయించింది. వివిధ రకాల చిరుధాన్యాలను సేకరించి వాటికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. విశేష ఆదరణతో అమ్ముడవుతున్న త్రిఫల చూర్ణం మాదిరి ప్రత్యేక ప్యాకెట్ల రూపంలో వీటిని అమ్మాలని ఆలోచన చేస్తోంది. ఇందులోభాగంగా ప్రయోగాత్మకంగా కిలో, ఐదు కిలోల వంతున పలు రకాల చిరుధాన్యాలను ప్యాకెట్లగా తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్-చైర్మన్ టీ.బాబూరావునాయుడు మంగళవారం ‘ఆంధ్రభూమి’కి తెలియజేశారు. ఆయుర్వేదిక్ షాపింగ్ మాల్స్ ద్వారా విరివిగా అమ్ముడవుతున్న చిరుధాన్యాలను జీసీసీ బ్రాండ్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నామని, వచ్చే నెలాఖరుకు పూర్తిస్థాయిలో ఏపీ మొత్తం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. షాపింగ్ మాల్స్‌కు దీటుగా ఎక్కడికక్కడ పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి వీటి విక్రయాలు సాగిస్తామన్నారు.
అసెంబ్లీలో జీసీసీ ఉత్పత్తులు
జీసీసీ చరిత్రలోనే ఎపుడూ లేనివిధంగా తొలిసారిగా జీసీసీ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. వినూత్న తరహాలో గత రెండు రోజులుగా జీసీసీ బ్రాండ్‌తో కూడిన ఉత్పత్తులను ప్రతి ఎమ్మెల్యే, మంత్రికి ప్రత్యక్షంగా అందజేస్తున్నారు. జీసీసీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్‌ను కలిసి వీటిని ఆదరించాల్సిందిగా కోరారు. తేనె, సబ్బులు, చిరుధాన్యాలు, అరకుకాఫీ, మల్టీ విటమిన్ బిస్కట్లు తదితర అనేక ఉత్పత్తుల గురించి వివరిస్తూ వీటికి ఆదరణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

చిత్రం...జీసీసీ ఎండీ బాబూరావునాయుడు