బిజినెస్

254 స్టార్టప్ కంపెనీలకు రూ. 1700 కోట్ల పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: సెబీలో నమోదైన 254 స్టార్టప్ కంపెనీలకు 1,700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఆల్టర్‌నేటివ్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్), కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) సంయుక్తంగా ఈ పెట్టుబడులను అందించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు అందించడానికి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌కు 10 వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. వివిధ పరిశ్రమలు, ఆంతరంగిక వాణిజ్యం తదితర రంగాల అభివృద్ధికి ఏఐఎఫ్, ఎఫ్‌ఎఫ్‌ఎస్ కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎఫ్‌ఎఫ్‌ఐ తరఫున చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్‌ఐడీబీఐ) కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆయన వివరించారు. 14, 15, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ పెట్టుబడులు విడుదల జరిగినట్టు గోయల్ వివరించారు. మొత్తమీద కేంద్రం 25,725 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను కేటాయించిందని ఆయన తెలిపారు. ఏఐఎఫ్ 1.701.03 కోట్ల రూపాయలను పెట్టుబడిగా అందించినట్టు ఆయన చెప్పారు.