బిజినెస్

కేవిబీ లాభాల్లో 59 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: కరూర్ వైశ్యా బ్యాంకు త్రైమాసిక లాభాల్లో 59 శాతం వృద్ధి నమోదైంది. గత జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను ఆ బ్యాంకు బుధవారం నాడిక్కడ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. రూ. 72.92 కోట్ల నికర లాభాలు వచ్చిందని ఆ బ్యాంకు తెలిపింది. మొండి రుణాణాల శాతాన్ని తగ్గించుకోవడంతోబాటు, వడ్డీ రాబడిని పెంచుకోవడంలో జరిగిన కృషి వల్లే ఈ లాభాలు సాధ్యమయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 45.91 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించింది. కాగా తాజా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 1,762.37 కోట్లు వచ్చిందని, గడచిన ఏడాది ఈ కాలంలో రూ. 1,697.40 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న నిల్వ నిధులు, ఇతర త్రా బ్యాంకుకు ఉన్న నిధులు ఈ త్రైమాసికంలో ద్విగుణీకృతం అయ్యాయని, మొత్తం రూ. 32.46 కోట్లకు చేరిందని తెలిపింది. గడచిన ఏడాది ఇదేకాలంలో ఈ నిధులు రూ. 15.05 కోట్లు సమకూరాయని నివేదించింది. మొండి రుణాల శాతంతోబాటు, ఆకస్మిక (కంటిజెన్సీ) నిధుల శాతాన్ని రూ. 329.97 కోట్లకు తగ్గించామని బ్యాంకు అధికారులు తెలిపారు. గత త్రైమాసికంలో ఈ నిధులు రూ. 422.67 కోట్లుగా ఉండేవని తెలిపారు. ఇలావుండగా గడచిన జూన్ నెల నాటికి ఈ బ్యాంకు మొత్తం రుణాలపై టోకు మొండి రుణాలు ఈ త్రైమాసికంలో 9.17 శాతం పెరిగాయని, గత ఏడాది జూన్ మాసంలో ఈ శాతం 7.44గా ఉండేదని తెలిపింది. అలాగే నికర నిరర్థక ఆస్తులు సైతం 4.50 శాతం పెరిగాయని తెలిపింది. బ్యాంకు నిరర్థక ఆస్తుల విలువ మొత్తం రూ. 4,510.83 కోట్లు చేరిందని, గత ఏడాది ఇదే కాలంలో ఈ ఆస్తుల విలువ రూ. 3,563.39 కోట్లుగా ఉండేదని వెల్లడించింది. నికర నిరర్ధక ఆస్తుల విలువ రూ. 2,088.32 కోట్ల నుంచి రూ. 2,321.77 కోట్లకు పెరిగిందని నివేదించింది. మొత్తం ఖాతాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని, ఆర్బీఐ నిర్దేశించిన ఆరు నెలల్లోగా ఈ ఆడిట్ ముగుస్తుందని తెలిపింది. రెండు ఖాతాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ డ్రాఫ్ట్ నివేదిక అందిందని, దానిపై బ్యాంకుల కన్సార్జియంలో చర్చించామని రూ. 261.72 కోట్ల బ్యాలెన్స్ ఔట్‌స్టాండింగ్ ఆ నివేదికలో నిర్థారించారని దాన్ని నిరర్థక ఆస్తిగా గుర్తించి రికవరీ చర్యల నిమిత్తం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి నివేదించామని తెలిపింది.