బిజినెస్

నష్టాల్లో సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : అంతర్జాతీయ సూచికలు ప్రతికూల ధోరణులను ప్రదర్శించడంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ బుధవారం నష్టాల్లో ముగిసింది. ఉదయం లావాదేవీలు ప్రారంభమైన వెంటనే ఆరంభమైన మొదటి గంటలో సెనె్సక్స్ 38,125 పాయింట్లకు పెరిగింది. అయితే, అంతర్జాతీయ సూచీలతోపాటు దేశీయ మదుపరుల నిరాసక్తత కూడా జతకట్టడంతో మధ్యాహ్నం నాటికి సుమారుగా 37,650 పాయింట్ల వరకు పడిపోయింది. ఆ తర్వాత మెల్లగా పుంజుకుని 37,847.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితంగా నష్టం 135.09 పాయింట్లుగా నమోదైంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ప్రతికూల పరిస్థితులు కొనసాగాయి. నిఫ్టీ 59.75 పాయింట్లు పతనమై 11,271.30 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ఇండస్‌ఇండ్ షేర్ల ధరలు భారీగా నష్టపోయాయి. 3.87 శాతం వరకు షేర్ల ధర పతనం కావడంతో వాటాదారులు భారీగా నష్టాన్ని ఎదుర్కొన్నారు. బజాజ్ ఫైనాన్స్ 3.17, టాటా మోటార్స్ 3.17, టాటా స్టీల్స్ 3.06, హీరో మోటార్స్ 2.63 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అయితే, ప్రతికూల పరిస్థితుల్లోనూ మదుపరులను ఆకట్టుకున్న ఏషియన్ పెయింట్స్ వాటాల ధర 3.42 శాతం పెరిగింది. అదేవిధంగా హెచ్‌యూఎల్ (2.06శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (1.84), హెచ్‌సీఎల్ టెక్ (0.95), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (0.70 శాతం) కూడా లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్ల ధర దారుణంగా పతనమయ్యాయి. యూపీఎల్ వాటాలు 5.45 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. అదానీ పోర్ట్స్ షేర్లు 5.08 శాతం నష్టాలను చవిచూశాయి. ఇండియాబుల్స్ (4.50 శాతం), ఇచెర్ (3.73 శాతం), ఇండస్‌ఇండ్ (3.58 శాతం) నష్టాలను ఎదుర్కొన్నాయి. కాగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ 4.28 శాతం, ఏషియన్ పెయింట్స్ 3.44 శాతం, హెచ్‌యూఎల్ 2.19 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.94 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.19 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి.