బిజినెస్

ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక బలోపేతానికి కేంద్ర ఆర్థిక సాయం స్వల్పమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 25: ప్రభుత్వ రంగ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) నుంచి కొనుగోలు చేసే ఆస్తులపై ప్రభుత్వం పాక్షిక రుణ హామీ ఇవ్వడం నిధులకు సంబంధించిన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగజేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘్ఫట్చ్’ అధ్యయన నివేదిక తెలిపింది. ఐతే ఈ ఉపశమనం కేవలం స్వల్పకాలానికే పరిమితం అవుతుందని తేల్చింది. ఆర్థికంగా బలమైన ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అధిక కనీసం ఒక ట్రిలియన్ రూపాయల విలువైన ధరలతో కూడిన ఆస్తుల కొనుగోలుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకదఫాగా ఆరునెలల పాక్షిక రుణ హామీని ఇస్తామని గత బడ్జెట్ సమాశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మొత్తం ఆస్తుల కొనుగోలు విలువలో 10 శాతం ప్రభుత్వం అందజేస్తుంది. ఐతే స్థిరాస్తికి సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తుల విషయంలో దీర్ఘకాలానికి ఇది ప్రయోజనం చేకూర్చదని ఆ నివేదిక అభిప్రాయపడింది. కీలక నష్టాల నుంచి బయటపడేందుకు ఈ సాయం ఉపకరిస్తుందని పేర్కొంది.