బిజినెస్

సుదీర్ఘకాల నష్టాలతో స్టాక్‌మార్కెట్లు విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరోరోజైన గురువారం సైతం నష్టాలను చవిచూశాయి. సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. జూలై డెరివేటివ్ కాంట్రాక్టుల గడువుముగిసిపోతున్న దృష్ట్యా మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించారు. దీంతో బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 16.67 పాయింట్లు కోల్పోయి 0.04 శాతం నష్టాలతో 37,830.98 పాయింట్ల దిగువన స్థిరపడింది. తొలుత 394 పాయింట్లు ఎగబాకి ఆశలు రేపిన సెనె్సక్స్ ఆ తర్వాత నేలచూపులు చూసింది. ఇంట్రాడేలో ఓ దశలో 37,775.51 పాయింట్ల కనిష్టాన్ని, మరోదశలో 38,169.87 పాయింట్ల గరిష్టాన్ని స్పృశించింది. ఇక బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 19.15 పాయింట్లు కోల్పోయి 0.17 శాతం నష్టాలతో 11,252 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఓ దశలో 11,239.35 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 11,361.40 పాయింట్ల గరిష్టాన్ని ఈ సూచీ తాకింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో టాటామోటార్స్ అత్యధికంగా 4.56 శాతం నష్టాల పాలైంది. ఈ సంస్థ త్రైమాసిక ఫలితాలు విడుదలైన క్రమంలో వాటాలపై ప్రతికూల ప్రభావం పడిందని విశే్లషకులు తెలిపారు. అలాగే బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్‌బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటాస్టీల్ సైతం 3.95 శాతం నష్టపోయాయి. జూలై ఫ్యూచర్స్ అండ్ ఆఫ్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ముగిసిపోవడంతో మార్కెట్లు తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు గురయ్యాయని వ్యాపారులు తెలిపారు. తొలుత సానకూలంగానే ఆరంభమైన ట్రేడింగ్ ఆ తర్వాత హెవీ వెయిట్ సూచీలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఐటీ, ఎల్ అండ్ టీ తీవ్ర నష్టాల పాలవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని అంటున్నారు. కాగా ఆసియాలో అధిక శాతం సూచీలు గురువారం లాభాలనే నమోదు చేశాయి. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య సుమారు ఏడాది కాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపుపలికే దిశగా ఇరుదేశాలు చర్యలకు ఉపక్రమించడం ఆసియా మార్కెట్లకు ఊతమిచ్చింది. ఇరుదేశాలకు చెందిన అధికారులు వచ్చేవారం రెండు రోజుల పాటు సంప్రదింపులు జరుపుతాయరన్న వార్తలతో మదుపర్లు వాటాల కొనుగోళ్లపై అసక్తి చూపారు. ఈక్రమంలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, నిక్కీ లాభాలతో ముగిశాయి. కోస్పి మాత్రం నష్టాలను నమోదు చేసింది. ఇక ఐరోపా మార్కెట్లు గురువారం ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.
రూపాయి బలహీనం
కరెన్సీ స్థితిగతులను పరిశీలిస్తే అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం స్వల్పంగా తగ్గి ఇంట్రాడేలో రూ.69.02గా ట్రేడైంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.79 శాతం పెరిగి బ్యారెల్ 63.68 డాలర్లు పలికింది.