బిజినెస్

రాయితీలు ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విడిగా పన్ను రాయితీలు ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. వైసీపీ సభ్యుడు అవినాశ్ రెడ్డి గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అడిగిన ప్రధాన ప్రశ్నకు బదులిస్తూ దేశ స్థాయిలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పన్ను రాయితీలు ఇవ్వటం గురించి మాత్రమే కేంద్రం ఆలోచించగలుగుతుందని ఆయన చెప్పారు. విడిగా ఒక్క రాష్ట్రానికి పన్ను రాయితీలు కల్పించలేమని గడ్కరీ స్పష్టంగా చెప్పారు. విడిగా రాష్ట్రాల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు కల్పించటం, జీఎస్‌టీ మినహాయింపు సాధ్యం కాదని అన్నారు. జీఎస్‌టీ సమాఖ్య ఏదైనా రాయితీ కల్పించాలనుకుంటే వారు మొదట ఒక విధాన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని గడ్కరీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కొత్త క్లస్టర్లు, కొత్త పథకాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీలో ఉపాధి కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలను అందజేస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రకటించిన రెండు శాతం వడ్డీ రాయితీ పథకాన్ని రాష్ట్ర ఆర్థిక సంస్థ నుండి రుణాలు తీసుకున్నవారికి కూడా వర్తింపజేయాలని అవినాశ్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా కల్పించనందున ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైద్య పరికరాల క్లస్టర్‌ను వైద్య పరికరాల ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించామని గడ్కరీ వెల్లడించారు. విశాఖపట్నంలోని వైద్య పరికరాల క్లస్టర్ చాల బాగా పని చేస్తోందని కితాబిచ్చారు. ప్రతి ఏటా మనం దాదాపు యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాము.. విశాఖపట్నం వైద్య పరికరాల క్లస్టర్‌ను బాగా అభివృద్ధి చేస్తే వైద్య పరికరాల దిగుమతి బాగా తగ్గించవచ్చునని గడ్కరీ తెలిపారు. ఎంఆర్‌ఐ యంత్రాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే 4కోట్ల 50లక్షల రూపాయలు చెల్లించవలసి వస్తోంది. మన శాస్తవ్రేత్తలు ఇదే యంత్రాన్ని రూ.98 లక్షలకే తయారు చేస్తున్నారని కేంద్ర మంత్రి వివరించారు. విశాఖపట్నం వైద్య పరికరాల క్లస్టర్‌ను అభివృద్ధి చేసి అక్కడ మోకాలు నొప్పి, ఇతర నొప్పులకు సంబంధించిన వైద్య పరికరాలను తయారు చేయాలనుకుంటున్నామని గడ్కరీ తెలిపారు. విశాఖపట్నంలోని వైద్య పరికరాల క్లస్టర్‌ను ప్రధాన క్లస్టర్‌గా అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఐదారు క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు.
చిత్రం... కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ