బిజినెస్

జీఎస్‌టీ మండలి సమావేశం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : విద్యుత్ వాహనాలపై పన్ను రేటును తగ్గించేందుకు గురువారం జరగాల్సిన వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం వాయిదాపడింది. 36వ జీఎస్‌టీ మండలి సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగాల్సిఉండగా ఇందులో కేవలం ఒకే అంశాన్ని పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ వాహనాలపై జీఎస్‌టీ పన్ను రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాల్సివుంది. ఐతే ఈ సమావేశం వాయిదా పడిందని తదుపరి తేదీని త్వరలోప్రకటిస్తామని అధికారులు తెలిపారు, ఈ మండలికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు హాజరుకావాల్సి ఉన్న దృష్ట్యా ఈ సమావేశాన్ని వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బ్యాంకుల మోసాలు, దివాళా నివారణ చట్టంలో సవరణలకు సంబంధించి చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. ఇలావుండగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అమిత్‌మిత్రా గత మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ‘కేంద్రం కేవలం వాహన తయారీ పరిశ్రమలోని విద్యుత్ వాహనాల తయారీని దృష్టిలో ఉంచుకుని జీఎస్‌టీ పన్ను రేటును తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల మిగిలిన వాహన తయారీ రంగం ఎంతగా ఇబ్బందులు పాలవుతుందనే విషయం పరిగణలోకి తీసుకోలేద’ని ఆ లేఖలో మిత్రా పేర్కొన్నారు. ‘పెట్రోల్, డీజిల్ కార్లపై ఇప్పటికే జీఎస్‌టీ పన్నురేటు అత్యధికంగా 28 శాతంగా ఉంద’ని గుర్తు చేశారు. రాష్ట్రాలకు చెందిన కీలక సమస్యలను సైతం అజెండాలో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులంతా సభ్యులు. గత నెలలో జరిగిన ఈ మండలి సమావేశంలో విద్యుత్ వాహనాలపై పన్ను రాయితీలు, విద్యుత్ చార్జర్లు, విద్యుత్ వాహనాలను అద్దెప్రాతికన తీసుకోవడంపై చర్చించి అధికారుల కమిటీకి పంపడం జరిగింది. తాజాగా అధికారుల కమిటీ సిఫార్సులపై గురువారం మండలి సమావేశం జరగాల్సివుండగా వాయిదా పడింది.